Jio Number Re Verification : జియో సిమ్ వాడుతున్నారా ? ఫోన్ నంబర్ రీ వేరిఫికేషన్ ఇలా..
మీకు కూడా అలాంటి మెసేజ్ వచ్చి ఉంటే వెంటనే మీ ఫోన్ నంబర్‌ను రీ వేరిఫై చేసుకోండి. ఇది తప్పనిసరి అని గుర్తుంచుకోండి.
- By Pasha Published Date - 09:22 AM, Mon - 29 April 24

Jio Number Re Verification : మీరు జియో సిమ్ వాడుతున్నారా ? అయితే ఈ సమాచారం మీకోసమే ! ఇతరుల ఐడీ కార్డులతో రిలయన్స్ జియో సిమ్ తీసుకొని వాడుతున్న వాళ్లంతా ఇప్పుడు తప్పకుండా రీ వేరిఫికేషన్ చేయించుకోవాల్సిందే. లేదంటే సిమ్ కార్డు బ్లాక్ అవుతుంది. రీ వేరిఫికేషన్ చేయించుకోవాలని కోరుతూ రిలయన్స్ జియో ఇప్పటికే తమ యూజర్లకు మెసేజ్‌లు పంపుతోంది. కాల్స్ చేస్తోంది. మీకు కూడా అలాంటి మెసేజ్ వచ్చి ఉంటే వెంటనే మీ ఫోన్ నంబర్‌ను రీ వేరిఫై చేసుకోండి. ఇది తప్పనిసరి అని గుర్తుంచుకోండి.
We’re now on WhatsApp. Click to Join
- జియో ఫోన్ నంబరు రీ వేరిఫికేషన్ కోసం మీరు తొలుత మై జియో(My Jio) యాప్‌లోకి ఫోన్ నంబరు ద్వారా లాగిన్ కావాలి.
- అక్కడ మీకు ‘రీ వేరిఫికేషన్ పెండింగ్’ అనే మెసేజ్ కనిపిస్తుంది.
- ఆ మెసేజ్‌పై క్లిక్ చేయగానే ‘రీవేరిఫై నౌ’ అనే బటన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- అనంతరం వచ్చే బాక్సులలో మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఒకవేళ అది లేకుంటే ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లాంటి ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాల వివరాలను కూడా అప్‌లోడ్ చేయొచ్చు.
Also Read :Sixth Phase Elections : ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- ఆధార్‌తో వేరిఫై చేసుకోవాలని భావించే వారు ఆధార్‌కార్డ్ అనే ఆప్షనుపై క్లిక్ చేసి, జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. మీ ఫోన్ నంబరుకు వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి.
- అనంతరం ఫోన్ కెమెరాను ఓపెన్ చేసి.. మీ ఫొటో తీసుకోవాలి. ఈ ఫొటో తప్పకుండా ఆధార్ కార్డులో ఉన్న ఫొటోతో మ్యాచ్ కావాలి.
- చివరగా సబ్మిట్ బటన్‌పై మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది.
- ఆ తర్వాత మీ జియో నంబర్ రీ వేరిఫికేషన్ ప్రాసెస్ ప్రారంభమయ్యాక ఫోనుకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. దానిలో టికెట్ ఐడీ ఉంటుంది.
- జియో నంబర్ రీ వేరిఫికేషన్ పూర్తవడానికి దాదాపు 8 గంటలు టైం పడుతుంది.
- రీ వేరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక దానిపై మీకు మరో మెసేజ్ అందుతుంది.