HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Jharkhand Cm Hemant Soren Meet With Rahul And Kharge

Hemant Soren : రాహుల్, ఖర్గేలతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భేటీ

తాను కాంగ్రెస్ అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలిశానని, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీలు త్వరలో చర్చలు ప్రారంభిస్తాయని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు.

  • Author : Latha Suma Date : 03-09-2024 - 2:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jharkhand CM Hemant Soren meet with Rahul and Kharge
Jharkhand CM Hemant Soren meet with Rahul and Kharge

Hemant Soren : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. తాను కాంగ్రెస్ అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలిశానని, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీలు త్వరలో చర్చలు ప్రారంభిస్తాయని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

We’re now on WhatsApp. Click to Join.

తాను వీరిని కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెప్పారు. రానున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై తాము చర్చిస్తామని తెలిపారు. తాము పూర్తి బలంతో జార్ఖండ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇక హేమంత్ సోరెన్‌తో  పాటు ఆయన భార్య కల్పనా సోరెన్ కూడా కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీలో పాలుపంచుకున్నారు. కాగా, అంతకుముందు జార్ఖండ్ సీఎం సోరెన్ రాజస్ధాన్‌లోని అజ్మీర్లో సూఫీ సన్యాసి ఖ్వాజా గరీబ్ నవాజ్ను సందర్శించారు. రాష్ట్రం, దేశం సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కాగా జేఎంఎం సీనియర్‌ నేత, జార్ఖండ్‌ మాజీ సీఎం చంపై సోరెన్‌ ఇటీవల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం హేమంత్‌ సోరెన్‌తో పాటు పాలక జేఎంఎంకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

Read Also: Tomato Face Masks: ముఖంపై మ‌చ్చ‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా..? అయితే ఈ ఫేస్ ప్యాక్ వాడండి..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Hemant Soren
  • congress
  • mallikarjun kharge
  • rahul gandhi

Related News

Rahul Kerala

Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది

  • Pm Modi Hits Back At Rahul

    Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • Kavita Fire

    Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

  • Abhishek Manu Singhvi And V

    Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

  • Brs Car

    Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?

Latest News

  • Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

  • Ration Card : రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • Durgapur Expressway : దేవుడా.. ప్రారంభించిన 6 నెలల్లోనే కుంగిన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే !!

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd