Sunita Williams : సునీతా విలియమ్స్ అంతరిక్షంలోనే బూడిద కాబోతుందా..?
అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలుస్తోంది
- By Sudheer Published Date - 08:58 AM, Wed - 21 August 24

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్ (Sunita Williams), బచ్ విల్‌మోర్ (Butch Wilmore) లు అంతరిక్షంలోనే బూడిద కాబోతున్నారా..? తాజాగా యూఎస్ మిలటరీ స్పేస్ సిస్టమ్ మాజీ కమాండర్ రుడీ రిడాల్ఫ్ చేసిన ఈ కామెంట్స్ అనేక అనుమానాలకు తావీతిస్తుంది. జూన్ 5 న భూకక్ష్యకు 400 కిలోమీటర్లు ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక వారిని విజయవంతంగా తీసుకెళ్లింది. జూన్ 14న వారు భూమికి రావాల్సి ఉండగా.. బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యతో వారు భూమిపైకి రావడం వాయిదాపడుతూ వస్తున్నది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని థ్రస్టర్, హీలియం వ్యవస్థలు సరిగ్గా పనిచేయక పోవడం వల్ల వారు రాలేకపోతున్నారు. యుద్ధ ప్రతిపదికన భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా కృషి తీవ్రంగా కష్టపడుతుంది. కానీ ఇప్పట్లో వారు భూమి మీదకు రావడం కష్టమే అని నాసా తేల్చి చెప్పింది.
We’re now on WhatsApp. Click to Join.
సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి భూమి మీదకు రానున్నట్లు నాసా తెలిపింది. ఒకవేళ బోయింగ్ స్టార్ లైనర్ సురక్షితం కాదని భావిస్తే స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా తీసుకొస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన స్పేస్ఎక్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. కాగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలుస్తోంది. వీరు మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉందని యూఎస్ మిలటరీ స్పేస్ సిస్టమ్ మాజీ కమాండర్ రుడీ రిడాల్ఫ్ చెబుతున్నారు. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సురక్షితంగా భూమి మీదకు రావాలంటే..సర్వీస్ మాడ్యూల్ సరిగ్గా అతుక్కోవాలని…క్యాప్సూల్‌ను సరైన కోణంలో అంటిపెట్టుకుంటేనే వారు సేఫ్‌గా భూమికి పైకి తిరిగి రాగలుగుతారని చెబుతున్నారు. మాడ్యూల్ కోణం ఏ మాత్రం సరిగ్గా లేకపోయినా రాపిడి జరిగి మంటలు పుడతాయని రుడీ అంటున్నారు. దీనివలన ఆస్ట్రోనాట్స్ మాడి మసవుతారని పేర్కోవడం తో సునీతా విలియమ్స్, బచ్ ల సురక్షితత మీద మరిన్ని అనుమానాలు చెలరేగుతున్నాయి. మరి ఏంజరుగుతుందో చూడాలి.
Read Also : Bharat Bandh 2024: నేడు భారత్ బంద్.. వీటిపై ప్రభావం ఉంటుందా..?