Indo-Ukrainian couple: అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి!
ఒకరు ఇండియన్.. మరొకరు ఉక్రెనియన్.. దేశాలు వేరు.. మతాలు వేరు.. అయితేనేం వాళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
- By Balu J Published Date - 01:05 PM, Tue - 1 March 22

ఒకరు ఇండియన్.. మరొకరు ఉక్రెనియన్.. దేశాలు వేరు.. మతాలు వేరు.. అయితేనేం వాళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కేవలం రిలేషన్ షిప్ తోనే ఆగిపోకుండా మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు. కానీ ఈ జంట ఒకటి తలిస్తే.. పరిస్థితులు మరొకటి తలిచాయి.
నూతన వధూవరులు ప్రతీక్, లియుబోవ్ ల ప్రేమకథ సినిమా స్టోరీ తలపిస్తుంది. ఈ జంట (ఇండో-ఉక్రేనియన్) ఉక్రెయిన్‌లో పెళ్లి చేసుకొని.. వివాహ రిసెప్షన్‌ను ఇండియాలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఉక్రెయిన్ లో ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఉక్రెయిన్ లో యుద్ధ మేఘాలు అలుముకోవడంతో వెంటనే రిసెన్షన్ కోసం ఇండియా వచ్చారు. ఈ జంట ఇండియాకు వచ్చిన తర్వాత రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. యుద్ధ పరిస్థితులను తప్పించుకుని.. వివాహ రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. యుద్ధం త్వరగా ముగియాలని ప్రార్థిస్తున్నట్లు రంగరాజన్ తెలిపారు.
“ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా రక్తపాతం, అల్లకల్లోలంతో పాటు కోవిడ్ -19 వినాశన ప్రపంచాన్ని ప్రభావితం చేసింది” అని పూజారి రంగరాజన్ అన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ముగింపు పలికి శాంతిని నెలకొల్పాలని కోరుతూ 16వ శతాబ్దానికి చెందిన వెంకటేశ్వర మందిరంలో చిల్కూరు పూజారులు, భక్తులతో కలిసి ప్రార్థనలు చేశారు.