Obama : ట్రంప్ టారిఫ్‌లు అమెరికాకు మేలు చేస్తాయని నేను భావించడం లేదు : ఒబామా
ఇప్పుడు మౌనంగా ఉన్నవారంతా అప్పుడు ఎలా ప్రవర్తించి ఉంటాయో ఊహించడం కష్టం. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేసే విద్యార్థులను తొలగించాలంటూ యూనివర్సిటీలను కేంద్ర ప్రభుత్వం బెదిరించడం ఆందోళనకర అంశమన్నారు.
- By Latha Suma Published Date - 07:14 PM, Sat - 5 April 25

Obama : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తోన్న కొత్త టారిఫ్‌లు అమెరికాకు మేలు చేస్తాయని తాను భావించడం లేదని పేర్కొన్నారు. ట్రంప్ యంత్రాంగం తీరును కొంతకాలంగా నిశితంగా గమనిస్తున్నానని, ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదన్నారు. హక్కుల ఉల్లంఘనకు వైట్‌హౌస్ పాల్పడుతున్నట్లుగానే భావిస్తున్నానని, తాజా పరిణామాలు ఎంతో ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. ఇప్పుడు మౌనంగా ఉన్నవారంతా అప్పుడు ఎలా ప్రవర్తించి ఉంటాయో ఊహించడం కష్టం. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేసే విద్యార్థులను తొలగించాలంటూ యూనివర్సిటీలను కేంద్ర ప్రభుత్వం బెదిరించడం ఆందోళనకర అంశమన్నారు.
Read Also: Chhattisgarh : మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలి: అమిత్ షా
బరాక్ ఒబామా అమెరికా ఎన్నికల ముందు డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ రెండోసారి ఎన్నికైతే ఎదురయ్యే ముప్పు గురించి ముందే హెచ్చరించిన ఒబామా.. ట్రంప్ తనదైన శైలిలో వ్యవహరిస్తారని ఇబ్బందులు కలిగిస్తారని ఆయన చెప్పారు. ఇక ప్రస్తుత అధ్యక్షుడి నిర్ణయాల పట్ల మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్రంగా స్పందిస్తూ.. ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని అవి స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపైన టారిఫ్ పిడుగు వేశారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి అన్ని దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అమెరికాకు చాలా దేశాల నుంచి వివిధ రకాల వస్తువులు ఎగుమతి అవుతూ ఉంటాయి. అలాంటి వస్తువులపై సుంకాలు వసూలు చేస్తానని చెప్పిన ట్రంప్.. ఇటీవల ఏ ఏ దేశంపై ఎంత శాతం సుంకాలు వసూలు చేస్తారు అనేది విడుదల చేశారు. అయితే భారత్ నుంచి కూడా అమెరికాకు అనేక రకాల వస్తువులు ఎగుమతి అవుతూ ఉంటాయి. తాజాగా ప్రపంచ దేశాలతోపాటు భారత్‌పైనా ట్రంప్ సుంకాలు విధించిన విషయం తెలిసిందే.