HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Maoists Should Lay Down Their Arms And Join The Mainstream Of Public Life Amit Shah

Chhattisgarh : మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలి: అమిత్‌ షా

బస్తర్‌ గిరిజనుల అభివృద్ధిని మావోలు ఆపలేరన్నారు. మార్చి 2026 నాటికి నక్సల్‌ సమస్య అంతమవుతుందని అమిత్‌ షా తెలిపారు. లొంగిపోయి మావోయిస్టులకు అభివృద్ధిలో భాగమైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి రక్షణ ఉంటుందన్నారు.

  • By Latha Suma Published Date - 06:02 PM, Sat - 5 April 25
  • daily-hunt
Maoists should lay down their arms and join the mainstream of public life: Amit Shah
Maoists should lay down their arms and join the mainstream of public life: Amit Shah

Chhattisgarh : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో పర్యటించారు. అక్కడ రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన బస్తర్‌ పణ్‌డూమ్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ..మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. బస్తర్‌ గిరిజనుల అభివృద్ధిని మావోలు ఆపలేరన్నారు. మార్చి 2026 నాటికి నక్సల్‌ సమస్య అంతమవుతుందని అమిత్‌ షా తెలిపారు. లొంగిపోయి మావోయిస్టులకు అభివృద్ధిలో భాగమైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి రక్షణ ఉంటుందన్నారు. గతేడాది మొత్తంగా 881 మంది మావోయిస్టులు లొంగిపోగా.. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 521 మంది లొంగిపోయినట్లు చెప్పారు.

Read Also: WhatsApp New Feature: వాట్సాప్‌లో మీరు పంపే ఫైళ్లు సేవ్ కావొద్దా ? ఇదిగో ఫీచర్

ఏ మావోయిస్టు చనిపోయినా ఎవరిలోనూ సంతోషం లేదు. ఆయుధాలు అడ్డం పెట్టుకొని స్థానిక గిరిజనుల అభివృద్ధిని ఆపలేరు అని అమిత్‌ షా పేర్కొన్నారు. బస్తర్‌లో బుల్లెట్‌ కాల్పులు, బాంబు పేలుళ్ల రోజులు ముగిశాయి. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మావోయిస్టు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా మాలో భాగమే అని అమిత్‌ షా అన్నారు. స్థానికులు వైద్య, విద్య సదుపాయాలతోపాటు ఆధార్‌, రేషన్‌ కార్డులు, ఆరోగ్య బీమా పొందినప్పుడే ఇది సాధ్యమవుతుందన్న ఆయన.. నక్సల్స్‌ సమస్య తొలగిపోతేనే బస్తర్ అభివృద్ధి చెందుతుందన్నారు. 50 ఏళ్లుగా బస్తర్‌ అభివృద్ధికి దూరమైందన్న అమిత్‌ షా.. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే నిశ్చయంతో ప్రధాని మోడీ ఉన్నారని చెప్పారు.

బస్తర్ పణ్‌డూమ్ వేడుకలను వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని అమిత్‌షా ప్రకటించారు. ఆ పండుగకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తాను ఆహ్వానిస్తామని చెప్పారు. మరోవైపు మావోయిస్టురహిత గ్రామాల్లో రూ.కోటి విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ హామీ ఇచ్చారు.

Read Also: Show Cause Notices : రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bastar Pandum celebrations
  • bastars
  • chhattisgarh
  • Chhattisgarh CM Vishnu Dev Sai
  • maoists
  • Union Home Minister Amit Shah

Related News

Dgp Shivdhar Reddy

37 Maoists Surrendered : మావోయిస్టులపై రూ.1.41కోట్ల రివార్డు..డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట 37 మంది లొంగుబాటు..!

తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఏకంగా 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆజాద్, రమేశ్, సోమ్‌దా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుకు స్పందించి, జనజీవనంలో కలిసేందుకు ముందుకొచ్చిన ఈ 37 మందిపై మొత్తం రూ.1.41 కోట్ల రివార్డు ఉంది. ఈ మొత్తాన్ని వారికే అందజేస్తామని డీజీపీ తెలిపా

    Latest News

    • Telangana Global Summit : హైదరాబాద్ ఒక చారిత్రక క్షణానికి సాక్ష్యం కాబోతుంది – సీఎం రేవంత్

    • Yarlagadda Venkata Rao : గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వినూత్న ఆలోచనకు శ్రీకారం!

    • Telangana Global Summit : చరిత్ర సృష్టించబోతున్న హైదరాబాద్

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • IND vs SA: 25 సంవ‌త్స‌రాల త‌ర్వాత భార‌త గ‌డ్డ‌పై ఘ‌న‌విజ‌యం సాధించిన సౌతాఫ్రికా!

    Trending News

      • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

      • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

      • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

      • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

      • Baba Vanga: భ‌య‌పెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd