Hyundai Exter Super Features : ఆర్డినరీ ప్రైస్ లో ఎక్స్ ట్రాడినరీ వెహికల్.. హ్యుందాయ్ ‘ఎక్స్ టర్’
Hyundai Exter Super Features : హ్యుందాయ్ మోటార్ సరికొత్త ఎస్ యూవీ ‘ఎక్స్ టర్’ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
- By Pasha Published Date - 04:28 PM, Tue - 11 July 23
Hyundai Exter Super Features : హ్యుందాయ్ మోటార్ సరికొత్త ఎస్ యూవీ ‘ఎక్స్ టర్’ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అది కూడా రూ.5.99 లక్షల నుంచి రూ.9.31 లక్షల ప్రైస్ రేంజ్ లో !! మధ్య తరగతి ప్రజలు కూడా కొనగలిగేలా దీని ధరను నిర్ణయించారు. ఈ మోడల్ కారును తీర్చిదిద్దడానికి రూ.950 కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్టు (Hyundai Exter Super Features) హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఎండీ ఉన్సూ కిమ్ వెల్లడించారు.
Also read : Amaravathi Capital : సుప్రీంలో జగన్ కు మరో షాక్! అమరావతి రాజధాని పదిలం!!
ఫీచర్లు ఇవీ..
- ఎక్స్టర్ ఎస్‌యూవీలో ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, బ్లాక్ రేడియేటర్ గ్రిల్, సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్స్, రూఫ్ రెయిల్స్, ఇండికేటర్ మౌంటెడ్ ఓఆర్వీఎంలు, క్లాడింగ్, 15 ఇంచ్ డైమెంట్ కట్ అలాయ్ వీల్స్ ఉంటాయి.
- ఎక్స్టర్ ఎస్‌యూవీలో డైమెన్షన్స్ విషయానికొస్తే.. ఎక్స్టర్ పొడవు 3,815 మిల్లీమీటర్లు .. వెడల్పు 1,710 మిల్లీమీటర్లు ఉంటుంది. వీల్ బేస్ 2,450 మిల్లీమీటర్లు ఉంటుంది.
- హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్‌యూవీలో 5 సీటర్ కేబిన్‌లో బ్లాక్డ్ ఔట్ డాష్‌బోర్డ్, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, మెటల్ పెడల్స్, రేర్ ఏసీ వెంట్స్, క్రోమ్ ఫినిష్డ్ గేర్ నాబ్‌లు వస్తున్నాయి.
- ఎక్స్టర్ ఎస్‌యూవీలో వైర్ లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, 2.32 ఇంచ్ డిస్పలే ట్విన్ కెమెరాలతో కూడిన డాష్‌బోర్డ్ ఉంటాయి. 8 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ కూడా ఉంటుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కమాండ్‌తో కూడిన ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూజ్ కంట్రోల్, ఏబీఎస్, ఈఎస్సీ వంటివి సైతం లభిస్తాయి.
- ఎక్స్టర్ లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 82 హెచ్‌పీ పవర్‌ను, 113.8 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్/ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది. సీఎన్జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉండనుంది.
- ఎక్స్టర్ ఎస్‌యూవీలో పెట్రోల్ వెర్షన్ 19.4 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. సీఎన్జీ వెర్షన్ 27.1 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
- ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డిజిటల్ క్లస్టర్ కూడా ఉన్నాయి.
- 5.84 సెంటిమీటర్ల ఎల్సీడీ డిస్ప్లేతో పాటు వాహనం ముందు, వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.