HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Hyderabad A Dog Park In City Special Story On Pet Dogs Life Style

Dogs : పెంపుడు కుక్కలకు ప్రత్యేక పార్కు, బ్యూటీ పార్లర్ లు, బర్త్ డే పార్టీలు.. ఎక్కడో తెలుసా?

కుక్క..విశ్వాసానికి మారుపేరు. మనుషులలో చాలా మంది ఎక్కువగా ప్రేమించే జంతువు ఏదైనా ఉంది అంటే అది కేవలం కుక్క మాత్రమే. అందుకే ఈ సందర్భాన్ని బట్టి నీకంటే ఆ కుక్క నయం విశ్వాసం చూపిస్తుంది అని అంటూ ఉంటారు.

  • Author : Anshu Date : 28-06-2022 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dogs
Dogs

కుక్క..విశ్వాసానికి మారుపేరు. మనుషులలో చాలా మంది ఎక్కువగా ప్రేమించే జంతువు ఏదైనా ఉంది అంటే అది కేవలం కుక్క మాత్రమే. అందుకే ఈ సందర్భాన్ని బట్టి నీకంటే ఆ కుక్క నయం విశ్వాసం చూపిస్తుంది అని అంటూ ఉంటారు. అలా కుక్కలు ఒక పిడికెడు అన్నం పెడితే చాలు మన మీద బోలెడు విశ్వాసాలు చూపిస్తూ ఉంటాయి. ఇకపోతే చిన్న చిన్న గ్రామాలలో వీధి కుక్కలు బయట ఎవరైనా ఫుడ్ పెడితే అది తిని బ్రతికేస్తూ ఉంటాయి. కానీ పట్టణంలో పెరిగే శునకాల విషయానికి వస్తే.. వాట్ ఏ లైఫ్ స్టైల్ పూర్తి భిన్నంగా ఉంటుంది అని చెప్పవచ్చు. సిటీ లో పెరిగే వారు ఈ కుక్కలను ఖరీదు అయినప్పటికీ వాళ్లకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు.

ఎక్కువ మొత్తం డబ్బులతో ఆ కుక్కలను కొనుగోలు చేయడమే కాకుండా వారి ఆలనాపాలనా కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు పూర్తిగా కల్చర్ మారిపోయింది. ఎందుకంటే డాగ్స్ కోసం వేలతో పాటు లక్షల్లో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలి అంటే సాధారణ మనిషి లైఫ్ స్టైల్ కంటే కుక్క లైఫ్ స్టైల్ చాలా ఖరీదుగా మారిపోయింది. పెద్ద పెద్ద నగరాల్లో అయితే కుక్కల కోసం కూడా ప్రత్యేకంగా హాస్పిటల్స్, వాడికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా వెంటనే డాగ్స్ వైద్యులను సంప్రదిస్తుంటారు. అంతేకాకుండా మనుషుల మాదిరిగానే కుక్కలకు కూడా స్కానింగ్ మిషన్లు, స్కానింగ్ సెంటర్ లు ఇలా ప్రతి ఒక్క విషయం లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

డాగ్స్ హాస్పిటల్స్ మాత్రమే కాకుండా డాగ్స్ బ్యూటీ పార్లర్ లు,టబ్ బాత్, హెయిర్ కటింగ్ షాప్స్, బర్త్డే పార్టీలు,హెయిర్ డ్రెస్సింగ్ ఇలా వాటికోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేయడంతోపాటు వారికి సేవలు అందించడానికి ప్రత్యేకమైన శిక్షణ పొందిన సిబ్బంది ఉంటారు. డాగ్స్ సేవలు చేసేటప్పుడు వాటికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా వాటి కోసం ప్రత్యేకమై ఎక్యూప్ మెంట్స్ ని కూడా వినియోగిస్తూ ఉంటారు. అయితే హైదరాబాద్ లో డాగ్స్ కోసం ప్రత్యేకంగా డాగ్ పార్క్ ని గ్రేటర్ మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది. అయితే ఆ సమయంలో కుక్కలు అక్కడికి వచ్చి తోటి కుక్కలతో కలిసి సరదాగా ఆడుకుంటూ ఉంటాయి. వీకెండ్ సమయంలో అయితే ఈ కుక్కలను తీసుకువచ్చే కార్ల వల్ల అక్కడ పెద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంటుంది. వీకెండ్స్ లో డాగ్స్ డాగ్స్ పేరెంట్స్ తో ఈ ప్రాంతమంతా కిక్కిరిసి పోతుంది. అంతేకాకుండా కుక్కల కోసం బర్త్డే పార్టీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Life Style
  • Pet Dogs
  • pet dogs life style

Related News

KTR

ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నిన్న రాత్రి, హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, నాగ్‌పూర్‌లకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులతో ఏకాంతంగా చర్చించే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణలో మౌలిక సదుపాయాలు, పరిపాలన, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయాణాలపై చర్చ జరిగింది.” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్, పాత కథనాలనే పునరావృతం చేయడం, తప్పుడు ఘనతను

  • Zepto

    Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

Latest News

  • YOGA : యోగా మతం కాదు.. అంతర్గత శ్రేయస్సు కోసం ఓ శాస్త్రం : సద్గురు

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd