Kejriwal : మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌కు నిరాశే..!
- By Latha Suma Published Date - 09:16 PM, Wed - 10 July 24

Arvind Kejriwal: మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు నిరాశే ఎదురైంది. తన బెయిల్ పిటిషన్(Bail Petition)ను అత్యవసరంగా విచారించాలని కేజ్రీవాల్ చేసిన విజ్జప్తిని బుధవారం ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) తిరస్కరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర స్టే విధించిన విషయం తెలిసిందే. ఈడీ పిటిషన్‌పై కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానం అర్ధరాత్రి అందిందని.. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ కేసు విచారణను వాయిదా వేశారు. మంగళవారం రాత్రి 11 గంటలకు కేజ్రీవాల్ సమాధానానికి సంబంధించిన కాపీ ఇచ్చారని.. కౌంటర్ అఫిడవిట్ సిద్ధం చేసేందుకు సమయం లేదని ఏఎస్‌జీ తెలిపారు. అరవింద్ తరపు సీనియార్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కాపీని ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (IO)కి పంపినట్లు సింఘ్వీ తెలిపారు. కేజ్రీవాల్‌కు మంజూరైన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించిందని.. ఈ కేసు విచారణ అత్యవసరమని పేర్కొన్నారు. కేజ్రీవాల్ స్పందనపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఈడీకి అర్హత ఉందని జస్టిస్ కృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేసు విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మద్యం పాలసీ కేసులో వచ్చిన సొమ్మును గోవా ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించిందని ఈడీ ఆరోపించింది.
Read Also: Merge : డా. సింధు మాతాజీ ఆశీస్సులతో మొదలైన కొత్త సినిమా ‘మెర్జ్’..