Merge : డా. సింధు మాతాజీ ఆశీస్సులతో మొదలైన కొత్త సినిమా ‘మెర్జ్’..
లేడీ లయన్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3గా రాజు గుడిగుంట్ల నిర్మాతగా కొత్త డైరెక్టర్ బి. విక్రమ్ ప్రసాద్ దర్శకత్వంలో 'MERGE' అనే సినిమా మొదలైంది.
- By News Desk Published Date - 06:39 PM, Wed - 10 July 24

Merge : నేడు హైదరాబాద్ లోని శ్రీ భద్రకాళి పీఠంలో డా. సింధు మాతాజీ గారి ఆశీస్సులతో ఓ కొత్త సినిమా ప్రారంభమైంది. లేడీ లయన్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3గా రాజు గుడిగుంట్ల నిర్మాతగా కొత్త డైరెక్టర్ బి. విక్రమ్ ప్రసాద్ దర్శకత్వంలో ‘MERGE’ అనే సినిమా మొదలైంది.
ఈ సినిమాలో జబర్దస్త్ రాము, అంబటి శ్రీను, శక్తి చైతన్య ,పెరికల మాధురి, హరి తేజ, చంటి, దిలీప్, బాలరాజు.. పలువురు నటించనున్నారు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని మొదలుపెట్టారు. అనంతరం నిర్మాత రాజు గుడిగుంట్ల మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ ఈ నెల 15వ తేదీన విజయవాడలో ప్రారంభం కానుంది అని తెలిపారు. సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది.
Also Read : Swayambhu : నిఖిల్ కూడా అదే బాటలో.. ‘స్వయంభు’ సినిమా కూడా..