Harish Rao : రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దూకి ఎవరు చావాలి?: హరీశ్ రావు
అబద్దం కూడా సిగ్గుపడి మూసిలో దుంకి ఆత్మహత్య చేసుకునేలా ఉంది..సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన ..
- By Latha Suma Published Date - 03:05 PM, Fri - 16 August 24

Harish Rao: రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, (CM Revanth Reddy) హరీశ్ రావుల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హరీశ్ రావు మాట్లాడుతూ..ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో రేవంత్ రెడ్డిలాంటి దిగజారిన, దిక్కుమాలిన సీఎంను చూడలేదని హరీశ్ రావు ఫైరయ్యారు. ‘నిజంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా? రూ.17,869 కోట్లు మాత్రమే అవుతాయా? మీరు దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దూకి ఎవరు చావాలి? సీఎంగా దేవుళ్ల మీద ప్రమాణం చేసి మాట తప్పావ్, దైవ ద్రోహానికి పాల్పడ్డావ్’ అంటూ ధ్వజమెత్తారు.
We’re now on WhatsApp. Click to Join.
‘రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేడు అనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు. అబద్దం కూడా సిగ్గుపడి మూసిలో దుంకి ఆత్మహత్య చేసుకునేలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా, నిస్సిగ్గుగా బిఆర్ఎస్ మీద నామీద అవాకులు చెవాకులు పేలాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40వేల కోట్ల రూపాయల రైతు రుణ మాఫీ ఏకకాలంలో చేస్తాన్నన్నది రేవంత్ రెడ్డే. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపిండని ఫైరయ్యారు.
Read Also: FIR Within 6 Hours: 6 గంటల్లో ఎఫ్‌ఐఆర్, వైద్యుల భద్రతకు కేంద్రం మార్గదర్శకాలు