Green Shade Nets : ట్రాఫిక్‌లో హాయ్ హాయ్.. సిగ్నల్స్ వద్ద గ్రీన్ నెట్స్
Green Shade Nets : ఎండలు దడ పుట్టిస్తున్నాయి. దీంతో ఉదయం వేళ రోడ్డుపైకి వెళ్లేందుకు వాహనదారులు జంకుతున్నారు.
- By Pasha Published Date - 11:28 AM, Thu - 2 May 24

Green Shade Nets : ఎండలు దడ పుట్టిస్తున్నాయి. దీంతో ఉదయం వేళ రోడ్డుపైకి వెళ్లేందుకు వాహనదారులు జంకుతున్నారు. ఎండల భగభగలను తట్టుకోలేమని హడలిపోతున్నారు. ఈ తరుణంలో వాహనదారులకు ఊరట కలిగించేలా కీలక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ నెట్లను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులు ఎండల్లో హాయ్ హాయ్ అని అంటున్నారు. తమ సౌకర్యం కోసం ఈ ఏర్పాట్లు చేసిన పుదుచ్చేరి ప్రజా పనుల విభాగంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దనున్న గ్రీన్ నెట్స్ వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్తా వైరల్‌గా మారాయి. మొత్తం మీద ట్రాపిక్ సిగ్నళ్ల వద్దనున్న గ్రీన్ నెట్స్ చలువ పందిళ్ల ప్రభావంతో వాహనదారులు కూల్‌గా ఫీల్ అవుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఏసీ హెల్మెట్లు..
అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డులకు ఎక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అయినా ట్రాఫిక్ సిబ్బంది డ్యూటీని కొనసాగిస్తున్నారు. ఎండా, వానా లేక్క చేయకుండా.. గంటల తరబడి రోడ్లపైనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సిబ్బంది సమస్యలపై సానుకూలంగా స్పందించిన గుజరాత్ సర్కార్ వారికి ఏసీ హెల్మెట్లు పంపిణీ చేయనుంది. ఇలా చేయడం దేశంలో ఇదే మొదటి సారి. వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు వడోదర ట్రాఫిక్ పోలీసులు ఈ పరిష్కారాన్ని కనిపెట్టారు. ఈ కొత్త ఏసీ హెల్మెట్‌లు(Green Shade Nets) 40-42 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతల సమయంలో కూడా కూల్‌గా ఉండేలా చూస్తాయి. ఈ హెల్మెట్ తయారీలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి ఎండ వేడిమి నుంచి కళ్లు, తలను కాపాడుకునేందుకు సాయం చేస్తాయి. ఈ హెల్మెట్‌కు ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. దీని ద్వారా వారు ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ హెల్మెట్‌ను పూర్తి స్థాయిలో ఛార్జింగ్ పెడితే.. సుమారు ఎనిమిది గంటల వరకు చల్లగా ఉంచగలదు. గుజరాత్ ట్రాఫిక్ పోలీసులు ఏసీ హెల్మెట్‌లు ధరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.