Maneka Gandhi Assets : మేనకాగాంధీ ఆస్తి రూ.97 కోట్లు.. ఐదేళ్లలో డబుల్
Maneka Gandhi Assets : ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మేనకా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు.
- By Pasha Published Date - 10:54 AM, Thu - 2 May 24

Maneka Gandhi Assets : ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మేనకా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికైన ఆమె ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join
దాని ప్రకారం.. 2019లో మేనకా గాంధీకి(Maneka Gandhi Assets) రూ. 55.69 కోట్ల ఆస్తులు ఉండగా.. అవి ఇప్పుడు రూ.97.17 కోట్లకు పెరిగాయి. మేనకా గాంధీ ఆస్తులు గత ఐదేళ్లలో 43 శాతం పెరిగాయి. మేనక మొత్తం ఆస్తుల్లో రూ.45.97 కోట్లు చరాస్తులు, రూ.51.20 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. 2019 సంవత్సరంలో ఆమెకు రూ.18.47 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉండగా.. ఇప్పుడు ఆ మొత్తం రూ.17.83 కోట్లకు తగ్గింది. డిబెంచర్లు, షేర్లు, బాండ్ల ధరల పెరుగుదల వల్ల మేనకకు 2019 సంవత్సరంలో రూ.5.55 కోట్ల ఆదాయం రాగా.. ఇప్పుడు ఆ ఆదాయం రూ.24.30 కోట్లకు పెరిగింది. 2019 సంవత్సరంలో పోస్టాఫీసు పొదుపు పథకాల ద్వారా మేనకకు రూ. 43.32 లక్షల ఆదాయం రాగా.. ఇప్పుడు ఆ ఆదాయం రూ.81.01 లక్షలకు పెరిగింది. మేనకా గాంధీ వద్ద రూ.2.82 కోట్లు విలువైన 3.415 కిలోల బంగారం, 85 కిలోల వెండితో పాటు రూ.40,000 విలువైన రైఫిల్ ఉన్నాయి.
Also Read : Office Peacocking : కార్పొరేట్ కంపెనీల్లో ‘ఆఫీస్ పికాకింగ్’.. ఏమిటిది ?
అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలపై మేనక ఏమన్నారంటే..
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోవడంపై మేనకా గాంధీ స్పందించారు. ఆ రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారో అని కామెంట్ చేశారు. ఇక తన కుమారుడికి బీజేపీ నుంచి పిలిబిత్ లోక్‌సభ టికెట్ దక్కకపోవడంపై స్పందించేందుకు మేనకా గాంధీ నిరాకరించారు. మరోవైపు అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను 24 గంటల్లో ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వెల్లడించారు. అభ్యర్థుల పేర్లను ప్రకటించే వరకు వేచి ఉండాలని, తొందరపాటు సరికాదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.