Goat Video : యజమానిని కౌగిలించుకుని వెక్కివెక్కి ఏడ్చిన మేక!!
- By Hashtag U Published Date - 07:30 PM, Wed - 20 July 22

ఎమోషన్స్ మనుషులకే కాదు.. జంతువులకూ ఉంటాయి!! పెంపుడు జంతువులకు మనుషులతో ఎంతటి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందో మనకు బాగా తెలుసు!! తాజాగా ఇందుకు అద్దం పట్టే ఒక ఘటన ఇటీవల చోటుచేసుకుంది. బక్రీద్ సందర్భంగా తనను అమ్మడానికి మార్కెట్ కు తెచ్చిన యజమానిని ఒక మేక హత్తుకుని మనిషిలా వెక్కి వెక్కి ఏడ్చింది.యజమాని భుజంపై తల పెట్టి.. కన్నీరు పెట్టింది. అక్కడున్న వాళ్లందరికీ మేక ఏడుపు వినిపించింది.యజమాని పై ఆ మేకకు ఉన్న అనుబంధం ఎంత అపురూపం అని అందరూ అనుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.
ఈ భావోద్వేగ సంఘటనకు నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. మేక ప్రేమకు ఫిదా అవుతున్నారు. మనషుల కంటే జంతువులే నయమని ఒకరు.. ఎమోషన్స్ మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటాయన మరొకరు వ్యాఖ్యానించారు. మేక ఏడ్చినా దాన్ని కోసుకుని తినడమేనని ఇంకొకరు కామెంట్స్ పెట్టారు.
Goat brought to be sold hugs owner, cries like human 💔😭 pic.twitter.com/k5LwYRKDqW
— Raam 🇮🇳 (@Ram_Vegan) July 15, 2022