HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Get Your Horoscope Predictions For All Zodiac Signs In Telugu For Thursday August 24th

Today Horoscope : ఆగస్టు 24 గురువారం రాశి ఫలితాలు.. వారు ఆచితూచి మాట్లాడాలి 

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

  • By Pasha Published Date - 08:35 AM, Thu - 24 August 23
  • daily-hunt
Today Horoscope
Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారు కుటుంబ వివాదాలకు దూరంగా ఉండాలి. అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. చంచల స్వభావాన్ని వీడండి. కొందరు ఇబ్బందులు కలిగించినా మీ ధర్మాచరణే మిమ్మల్ని కాపాడుతుంది. ఇంటి వ్యవహారాలను, ఆఫీసు వ్యవహారాలను బ్యాలెన్స్ చేయడంలో కొంత ఇబ్బంది పడతారు. అదృష్టం వరిస్తుంది. శివపార్వతుల అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని పూజించండి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారి మనసుకు ఇబ్బంది కలిగించే సంఘటనలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో తెలివిగా ప్రవర్తిస్తే మంచిది. ఖర్చు అదుపులో తప్పకుండా జాగ్రత్త పడాలి. మొహమాటం కారణంగా శ్రమ పెరుగుతుంది.  కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం.  శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి.

మిథునం

ఈరోజు మిథునరాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి. ఇతరులతో ఆచితూచి మాట్లాడాలి.  ఎదుటివారితో మంచిగా ప్రవర్తించాలి. మీరు చేసే పనిని నిరూపించుకోవడంలో సక్సెస్ అవుతారు.బ్రాహ్మణులకు గానీ ముత్తయిదువలకు గానీ తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది.

Also read:Ban Sugar Exports: అక్టోబర్ నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం..? గత 7 సంవత్సరాల్లో ఇదే తొలిసారి..!

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికంగా నష్టం రాకుండా చూసుకోవాలి.  ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. ధైర్యంగా ముందుకు సాగండి. అవసరాలకు సాయపడేవారున్నారు. మీ విధానాలు, పద్ధతులు చాలా లాజికల్ గా ఉంటాయి. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి.

సింహం

ఈరోజు సింహరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్ని  ఇస్తుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ధనమును ఖర్చు చేయాలి. శివారాధన శుభప్రదం.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారు వివాదాలకు దూరంగా ఉండండి. విఘ్నాలను అధిగమిస్తారు.మిత్రబలం పెరుగుతుంది. శత్రుపీడ తొలగుతుంది.అవసరాలకు ధనము అందుతుంది. అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. న్యాయపరమైన వ్యవహారాల్లో మీకు అనకూల ఫలితాలు వస్తాయి. బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి.

Also read: Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతం.. మూన్ మిషన్‌ కోసం కసరత్తులు చేస్తున్న పలు దేశాలు..!

తుల

ఈరోజు తులారాశి వారికి కొన్ని సందర్భాల్లో మనసుకు భయం కలుగుతుంది. చిన్న చిన్న సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒత్తిడిని జయించాలి. పై అధికారులతో మీ ప్రవర్తన మెరుగ్గా ఉంచుకోండి.  కొత్త ధన వనరులు ఏర్పడతాయి.భగవంతుని అనుగ్రహంతో ముఖ్యమైన పని పూర్తవుతుంది. వారాంతంలో శుభయోగం ఉంది. గణపతి ధ్యానం రక్షిస్తుంది.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారు సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఇబ్బందులను అధిగమిస్తారు. ఆర్థికంగా శక్తిమంతులవుతారు. కొత్త పధకాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. మీ మాటతీరు ప్రశంసలు అందుకుంటుంది.   దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారు ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు.  రుణ లావాదేవీలు నష్టాన్ని కలిగిస్తాయి. ఖర్చులు నియంత్రించుకోవాలి.  వృథా ప్రయాణాలు ఉంటాయి. సబార్డినేట్ ఉద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు. బ్రాహ్మణులకు గానీ ముత్తయిదువలకు గానీ తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది.

మకరం

ఈరోజు మకర రాశి వారు ప్రమాదాలకు దూరంగా ఉండండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. శ్రమ అవసరం. ఆర్థికంగా మధ్యస్థ సమయం. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు. ప్రయాణాలు కలసివస్తాయి. గణపతినీ, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి.

Also read: Kesar Milk: పాలలో కుంకుమపువ్వు కలిపి తాగితే.. ఇన్ని ఉపయోగాలా..?

కుంభం

ఈరోజు కుంభ రాశి వారికి అన్ని విధాలుగా శుభయోగాలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి గుడ్ న్యూస్ వింటారు. ఆస్తి వృద్ధి చెందుతుంది. శక్తివంచన లేకుండా పనిచేస్తే శుభఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సూర్యధ్యానం ఆరోగ్యాన్నిస్తుంది.

మీనం 

ఈరోజు మీన రాశి వారి మనసులో ఏదో నిర్లిప్తత ఏర్పడవచ్చు. ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఏ విషయంలోనూ అశ్రద్ద వద్దు. కొన్ని పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు ఆలస్యం అవుతాయి.  నూతన ఒప్పందాలు ఖరారు చేసుకునేందుకు ఇదే మంచి సమయం. బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • August 24th
  • horoscope
  • horoscope in telugu
  • horoscope today
  • thursday
  • today horoscope
  • weekly horoscope
  • Weekly Horoscope in telugu

Related News

    Latest News

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    Trending News

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd