Foreign Students In India: భారతదేశంలో చదువులను ఇష్టపడుతున్న విదేశీయులు!
కరోనా మహమ్మారి కారణంగా చదువుల కోసం భారతదేశానికి వచ్చే విదేశీయుల సంఖ్య కొంత తగ్గింది. కానీ ఇప్పుడు మరోసారి దానిలో గణనీయమైన పెరుగుదల కనిపించింది.
- By Gopichand Published Date - 11:02 AM, Fri - 6 December 24

Foreign Students In India: భారతదేశంలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో యువత చదువుల కోసం విదేశాలకు (Foreign Students In India) వెళుతున్నారు. ముఖ్యంగా అమెరికా యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇక్కడ చదువుతున్న ఇతర దేశాల విద్యార్థుల్లో భారతీయుల వాటా 29 శాతానికి చేరుకుంది. మరోవైపు విదేశీ విద్యార్థులు భారతీయ విద్యా వ్యవస్థలో భాగం కావడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇప్పటి వరకు చాలా రిజిస్ట్రేషన్లు జరిగాయి
కరోనా మహమ్మారి కారణంగా చదువుల కోసం భారతదేశానికి వచ్చే విదేశీయుల సంఖ్య కొంత తగ్గింది. కానీ ఇప్పుడు మరోసారి దానిలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. 2024-25 విద్యా సంవత్సరానికి 200 దేశాల నుండి 72,218 మంది విద్యార్థులు స్టడీ ఇన్ ఇండియా (SII) పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. విదేశీ విద్యార్థులు భారతదేశ విద్యా వ్యవస్థతో కనెక్ట్ అవ్వడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఈ గణంకాలు చెబుతున్నాయి.
Also Read: Pushpa 2 Effect : ఇక పై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి లేవు – మంత్రి కోమటిరెడ్డి
సంఖ్య పెరిగింది
2011-12లో భారత్‌కు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య 16,410 మాత్రమే కాగా, 2014-15లో 34,774కి పెరిగింది. 2016-17లో ఈ సంఖ్య 47,575కి చేరింది. 2019-20లో 49,348 మంది విదేశీ విద్యార్థులు భారతీయ విద్యా వ్యవస్థపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కానీ కరోనా మహమ్మారి ఈ పెరుగుతున్న సంఖ్యను ప్రభావితం చేసింది. ఇది 2014-15 స్థాయికి పడిపోయింది.
SII పనిని సులభతరం చేసింది
దీని తరువాత భారతదేశానికి రావాలనుకునే విదేశీ విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. 2023లో ప్రారంభించబడిన స్టడీ ఇన్ ఇండియా (SII) పోర్టల్ కూడా ఇందులో భాగమే. ఈ పోర్టల్ విదేశీ విద్యార్థుల కోసం అడ్మిషన్, వీసా ప్రక్రియలు మొదలైనవాటిని సులభతరం చేస్తుంది. 310 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో సహా 638 సంస్థల నుండి 8000 కంటే ఎక్కువ కోర్సులు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి ఇ-స్టూడెంట్ వీసా సౌకర్యం కూడా ఇక్కడ అందించబడింది.
ప్రభుత్వ ప్రయత్నమేంటి?
కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని ప్రపంచానికి ఎడ్యుకేషన్ హబ్‌గా చూపుతోంది. మన సంస్థలు విదేశాలలో తమ ఉనికిని చాటుకుంటున్నాయి. విదేశీ విశ్వవిద్యాలయాలను భారతదేశానికి ఆహ్వానిస్తున్నాయి. ఐఐటీ మద్రాస్ 2023లో టాంజానియాలోని జాంజిబార్‌లో క్యాంపస్‌ను ప్రారంభించనుంది. ఐఐటీ ఢిల్లీ 2024లో అబుదాబిలో తన క్యాంపస్‌ను ప్రారంభించింది. UGC రెగ్యులేషన్స్ 2023 ప్రకారం.. బ్రిటన్ సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం భారతదేశంలో తన క్యాంపస్‌ను ప్రారంభించబోతోంది. అలా చేసిన మొదటి యూనివర్సిటీ ఇదే. మన విశ్వవిద్యాలయాలలో 49 అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యానికి కూడా ప్రవేశించాయి.