Pakistan : పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్న విదేశాంగ మంత్రి జైశంకర్
Pakistan : ఈ సమావేశాలకు పాక్ నుంచి ఆహ్వానం అందినట్టు గత ఆగస్టు 30న ఒక ప్రకటనలో భారత్ ధ్రువీకరించింది. 2015 డిసెంబర్ అనంతరం భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి.
- Author : Latha Suma
Date : 04-10-2024 - 6:50 IST
Published By : Hashtagu Telugu Desk
External Affairs Minister Jaishankar : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం పాకిస్థాన్ వెళ్లనున్నారు. అక్టోబర్ 15-16 తేదీల్లో అక్కడ జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశానికి ఆయన హాజరవుతారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని పాక్ అధికారికంగా ఆహ్వానించింది. దీంతో మోడీ పర్యటనపై గత కొన్ని రోజులుగా సందిగ్ధం నెలకొంది. అయితే, మోడీ తరఫున జైశంకర్ ఈ సదస్సులో పాల్గొననున్నారు.
Read Also: YS Sharmila : త్వరలో సీఎం చంద్రబాబును కలుస్తా.. వైఎస్ షర్మిల
ఎస్‌సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశాలు ఈనెల 15,16 తేదీల్లో జరుగనున్నాయి. ఈ సమావేశాలకు పాక్ నుంచి ఆహ్వానం అందినట్టు గత ఆగస్టు 30న ఒక ప్రకటనలో భారత్ ధ్రువీకరించింది. 2015 డిసెంబర్ అనంతరం భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి. దివంగత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 2015లో ఆప్ఘనిస్థాన్‌లో కాన్ఫరెన్స్ కోసం ఇస్లామాబాద్‌లో పర్యటించారు.
ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (CHG) రొటేటింగ్ చైర్మన్‌షిప్ ఈసారి పాకిస్థాన్‌కు వచ్చింది. శిఖరాగ్ర సమావేశానికి ముందు మంత్రి వర్గ సమావేశం, ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సంస్కృతి, మానవతా సహాయంపై దృష్టి సారించేందుకు సీనియర్ అధికారుల సమావేశాలు జరుగనున్నాయి. రష్యా, చైనా, క్రిజిగ్ రిపబ్లిక్, కజకిస్థా్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షులతో 2001లో షాంఘైలో జరిగిన సమావేశంలో ఎస్ఈఓ ఏర్పాటైంది. 2017లో ఇండియా, పాకిస్థాన్ శాశ్వత సభ్యులయ్యారు. గత జూలైలో ఎస్‌సీఓకు సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. వర్చువల్ మీట్ నిర్వహించింది. ఇందులో పాకిస్థాన్ ప్రధాని ప్రధానమంత్రి షెహబాజ్ షరీప్ పాల్గొన్నారు. ఇదే సమావేశంలో ఇరాన్‌కు శాశ్వత సభ్యత్వం ప్రకటించారు.