Elon Musk Own Airport: ఎలన్ మాస్క్ కు వ్యక్తిగత ఎయిర్ పోర్ట్!
టెస్లా, SpaceX CEO ఎలన్ మస్క్ తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు.
- By Balu J Published Date - 03:39 PM, Mon - 1 August 22

టెస్లా, SpaceX CEO ఎలన్ మస్క్ తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన సొంతంగా ఎయిర్ పోర్ట్ నిర్మించుకోబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎప్పుడు, ఎక్కడ నిర్మిస్తారో తెలియకపోయినప్పటికీ కచ్చితంగా ఎయిర్ పోర్ట్ నిర్మిస్తారని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. విమానాశ్రయం టెక్సాస్‌లోని బాస్ట్రాప్ సమీపంలో ఆస్టిన్‌కు తూర్పున ఎక్కడో ఉంటుంది. సొంతంగా ఎయిర్ పోర్ట్ నిర్మించుకుంటే మస్క్, ఆయన కంపెనీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మాస్క్ భావిస్తున్నారు. టెస్లా కంపెనీ తన గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌ను ఆస్టిన్‌కు మార్చింది. ది బోరింగ్ కంపెనీని కూడా మార్చినట్లు సమాచారం. ప్రైవేట్ విమానాశ్రయం కోసం CEOకి ఎంత స్థలం అవసరమో తెలియదు; అయితే ఆస్టిన్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్ 130,000 చదరపు అడుగుల కమ్యూనిటీ స్థలాన్ని కలిగి ఉంది. దీనికి 6,025 అడుగుల రన్‌వే కూడా ఉంది. విమానాశ్రయాన్ని నిర్మించడం తక్షణం జరిగే పని కాదని సమాచారం. ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కచ్చితంగా EPA మరియు FAA ఆమోదాలు రెండూ అవసరం.