EC : హర్యానాలో ఉద్యోగ నియమాకాలపై ఈసీ ఆదేశాలు
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, అయినా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ హర్యానా సర్కారు ఉద్యోగ నియామకాలు చేపడుతోందని జైరామ్ రమేశ్ ఈసీకి ఫిర్యాదు చేశారు.
- By Latha Suma Published Date - 06:47 PM, Wed - 21 August 24

Election Commission: ఉద్యోగ నియామకాల కోసం హర్యానాలో కొనసాగుతున్న ప్రక్రియకు సంబంధించిన ఫలితాలను ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే నియామక ప్రాసెస్‌ను మాత్రం కొనసాగించవచ్చని పేర్కొంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, అయినా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ హర్యానా సర్కారు ఉద్యోగ నియామకాలు చేపడుతోందని జైరామ్ రమేశ్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం హర్యానాలో పోలీస్ డిపార్టుమెంట్ ద్వారా 5,600 కానిస్టేబుల్ ఉద్యోగాలు, హర్యానా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (HSSC) ద్వారా 76 టీజీటీ, పీటీఐ ఉద్యోగాలు, హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (HPSC) ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందకు నియామక ప్రక్రియ కొనసాగుతున్నది.
అయితే ఆయా ఉద్యోగాల నియామకం కోసం ప్రక్రియను కొనసాగించడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు రాదని, అయితే ఫలితాలు ప్రకటించడం మాత్రం ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామక ఫలితాలను ప్రకటించవద్దని ఈసీ ఆదేశించింది.