HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Drones Banned Within Shamshabad Airport Limits

Drones : శంషాబాద్‌ విమానాశ్రయం పరిధిలో డ్రోన్లపై నిషేధం

ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చిందని, జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత, విమానాల రాకపోకలలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ తెలిపారు.

  • By Latha Suma Published Date - 05:10 PM, Sat - 10 May 25
  • daily-hunt
Drones banned within Shamshabad airport limits
Drones banned within Shamshabad airport limits

Drones : నగరంలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలో డ్రోన్ల వినియోగంపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విమానాశ్రయం చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను ఉపయోగించరాదని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్ మహంతి వెల్లడించారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చిందని, జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత, విమానాల రాకపోకలలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. డ్రోన్ల వినియోగం వల్ల విమానయాన భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నందున, ముందస్తు జాగ్రత్తగా ఈ నిషేధం విధించినట్లు తెలిపారు. అనుమతి లేకుండా డ్రోన్లు వాడే లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Read Also: Act of War : ఇక పై ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తాం : భారత్‌

ఇదిలా ఉంటే, మరోవైపు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నగరాల్లో బాణసంచా కాల్చడంపై కూడా నిషేధం విధించబడింది. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతాల్లో బాణసంచా పేలుళ్లు ప్రజలలో భయాందోళనలు కలిగించే అవకాశం ఉన్నందున, ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆకస్మిక శబ్దాల వల్ల ఉగ్రవాద చర్యలుగా మినహాయించే ప్రమాదం ఉందని, ప్రజలు అపోహకు గురికాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామని సీపీ తెలిపారు. ప్రస్తుతం భారత్‌-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నగర ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. పోలీసుల ఆదేశాలను అతిక్రమించిన వారు చట్టపరమైన చర్యలకు గురవుతారని ఆయన హెచ్చరించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా తీసుకుంటున్న ఈ చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, శాంతి భద్రతల పరిరక్షణ అందరి బాధ్యత అని పోలీసు శాఖ స్పష్టం చేస్తోంది.

Read Also: Ayyanna Patrudu: భారత రక్షణ నిధికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నెల వేతనం విరాళం

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ban on drones
  • Cyberabad police commissioner Avinash Mohanty
  • Drones
  • Drones Use
  • Shamshabad Airport
  • Strict measures

Related News

    Latest News

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd