Dog Video Viral: ఈ కుక్క ఐడియాకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో!
ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ వీడియోల విషయానికి వస్తే కుక్క, పిల్లికి సంబంధించిన వీడియోలు లెక్కకు మించి వైరల్ గా మారాయి.
- By Balu J Published Date - 03:54 PM, Tue - 15 November 22

ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ వీడియోల విషయానికి వస్తే కుక్క, పిల్లికి సంబంధించిన వీడియోలు లెక్కకు మించి వైరల్ గా మారాయి. కానీ ఈ వీడియో మాత్రం చాలా ప్రత్యేకం. ఈ వీడియో చూస్తే మానవత్వం మనుషుల్లో మాత్రమే కాదు.. జంతువుల్లోనూ ఉంటుందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఒక కుక్క పిల్లి పిల్ల నీటిలో మునిగిపోకుండా కాపాడే వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఒక కుక్క చెక్కను నోటితో పట్టుకొచ్చి, అడవి మధ్యలో నీరు పారుతున్న ప్రదేశంలో ఏర్పాటుచేస్తోంది. నీటి ప్రవాహంతో ఇబ్బందులు పడుతున్న పిల్లి పిల్ల కోసం చక్క ఏర్పాటు చేయడంతో మెల్లగా నడుస్తూ అవతలకు క్షేమంగా చేరుకుంటుంది. ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో 24 గంటలు గడవకముందే దాదాపు 2 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్ వెయ్యండి మరి.
https://twitter.com/buitengebieden/status/1591780751389097985?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1591780751389097985%7Ctwgr%5Efd31d3ea9472fa31323cc62ce5bd283a22243112%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fviral%2Fviral-video-dog-saves-cat-dog-uses-unique-idea-to-save-little-kitty-from-drowning-video-goes-viral-watch-5741727%2F