Delhi Police : ఇకపై కొత్త లుక్‌లో కన్పించనున్న ఢిల్లీలోని పోలీసులు..!
దేశ రాజధాని ఢిల్లీలోని పోలీసులు త్వరలో కొత్త లుక్‌లో కన్పించనున్నారట. కార్గో ప్యాంట్లు , టీషర్టుల్లో వారు విధులు నిర్వహించనున్నట్లు సమాచారం.
- By Latha Suma Published Date - 03:38 PM, Thu - 18 July 24

Delhi Police: మామూలుగా పోలీసులు ఖాకీ చొక్కా, ప్యాంటే దరిస్తారు. కొన్ని చోట్ల తెలుపు, ఇతర రంగుల యూనిఫామ్ ఉన్నప్పటికీ ఎక్కువగా ఖాకీ దుస్తులే డ్రెస్ కోడ్ ఉంటుంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలోని పోలీసులు త్వరలో కొత్త లుక్‌లో కన్పించనున్నారట. కార్గో ప్యాంట్లు , టీషర్టుల్లో వారు విధులు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు సీనియర్ పోలీసు అధికారులను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. దేశ రాజధానిలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యూనిఫామ్‌లో మార్పులు చేయనున్నట్లు పోలీసు హెడ్‌క్వార్టర్స్ వర్గాలు తెలిపాయి.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఇన్‌స్పెక్టర్ నుండి కానిస్టేబుల్ ర్యాంక్ వరకు ఉన్న సిబ్బందికి కార్గోప్యాంట్లు(ఎక్కువ జేబులు ఉంటేవి), టీ షర్టులు ఇవ్వనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు చలికాలంలో శీతల పరిస్థితులను తట్లుకునేలా ఉలెన్ షర్టులు, ప్యాంట్లు ఇవ్వనున్నారట. అయితే, రంగులో ఎలాంటి మార్పు ఉండదని, కొత్త యూనిఫామ్ కూడా ఖాకీ రంగులోనే ఉంటుందని సమాచారం. కార్గో ప్యాంట్లకు ఎక్కువ జేబులు ఉంటాయి.
అందువల్ల పోలీసు సిబ్బంది డైరీలు, పోన్లు, ఆయుధాలు వంటివి సౌకర్యవంతంగా తీసుకెళ్లొచ్చు అని ఓ పోలీసు అధికారి తెలిపారు. దీనిపై త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ప్రణాళిక దశలోనే ఉంది. ట్రయల్ కోసం ఇప్పటికే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కానిస్టేబుళ్లకు ఈ కొత్త యూనిఫామ్ ఇచ్చారు.
Read Also:Tollywood : టాలీవుడ్ లో ఆ ఇద్దరి హీరోయిన్స్ దూకుడు..!