G20 – Delhi : జీ20 సదస్సుకు ఢిల్లీ ఇలా ముస్తాబైంది.. ఫోటో స్టోరీ
G20 - Delhi : సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరిగే ప్రతిష్టాత్మక ‘జీ20’ సదస్సు కోసం మనదేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
- Author : Pasha
Date : 28-08-2023 - 9:24 IST
Published By : Hashtagu Telugu Desk
G20 – Delhi : సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరిగే ప్రతిష్టాత్మక ‘జీ20’ సదస్సు కోసం మనదేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

వివిధ దేశాల అధినేతలు ప్రయాణించే మార్గాల్లోని రోడ్లను అందంగా, శుభ్రంగా కనిపించేలా సిద్ధం చేశారు.

నగరంలో పలుచోట్ల అందమైన శిల్పాలు, ఫౌంటైన్లు, లైటింగ్, పూల కుండలు ఏర్పాటు చేశారు.

అత్యవసర సేవల కోసం 80 మంది వైద్యులను, 130 అంబులెన్స్‌లను, 66 ఫైర్ ఇంజన్లను సిద్ధంగా ఉంచారు.

పాలం టెక్నికల్ ఏరియా, హోటళ్లు, సమ్మిట్ వేదిక నుంచి వివిధ వీధులు, రోడ్లపై జీ-20 లోగోలు, సదస్సులో పాల్గొనే దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు.

విద్యుత్ సరఫరాకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
