Court notices : కేసీఆర్, స్మితా సబర్వాల్‌కు కోర్టు నోటీసులు
Madigadda barrage collapse : మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల ప్రజా ధనానికి భారీ నష్టం వాటిల్లిందని భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు గతంలోనే మాజీ సీఎం కేసీఆర్, మరో ఏడుగురికి నోటీసులు పంపింది..
- By Latha Suma Published Date - 07:22 PM, Thu - 5 September 24

Madigadda barrage collapse : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, (KCR) ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు గురువారం సమన్లు జారీ చేసింది. ఈ మేరకు అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల ప్రజా ధనానికి భారీ నష్టం వాటిల్లిందని భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Free Electricity : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్: డిప్యూటీ సీఎం
ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు గతంలోనే మాజీ సీఎం కేసీఆర్, మరో ఏడుగురికి నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్నవారిలో మాజీ మంత్రి హరీశ్ రావు తరపున లలిత రెడ్డి, సుకన్య, అడ్వకేట్లు మెమో అప్పిరియన్స్ అయ్యారు. మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్అండ్ టీ ఎండీ సురేశ్ కుమార్ తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్ అవదాని, శ్రావణ్ రావు మెమో అప్పిరియన్స్ అయ్యారు.
ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్లు హరి రామ్, శ్రీధర్ తరపున వరంగల్ అడ్వకేట్ నరసింహారెడ్డి మెమో అప్పిరియన్స్ అయ్యారు. అయితే, ఈరోజు మాత్రం మాజీ కేసీఆర్, ఐఏఎస్ అధికారణి స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరుకాకపోవడంతో అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది.