Plants: మీ ఇంట్లో కొన్ని మొక్కల వల్ల అదృష్టం కలుగుతుందని మీకు తెలుసా?
మన ఇంట్లో పెంచుకునే కొన్ని రకాల మొక్కలు మనకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయని చెబుతున్నారు.
- By Nakshatra Published Date - 05:00 PM, Thu - 5 September 24
మామూలుగా మనం ఇంట్లో, ఇంటి బయట రకరకాల మొక్కలను చెట్లను పెంచుకుంటూ ఉంటాం. అయితే కొందరు కొన్ని వాస్తు ప్రకారంగా కొన్ని మొక్కలను పెంచుకుంటే మరి కొందరు వారికి ఇష్టం వచ్చిన అలాగే ఇల్లు అందంగా అలంకరించుకోవడం కోసం రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే మనం పెంచుకునే మొక్కలలో కొన్ని రకాల మొక్కలు మీకు అదృష్టాన్ని కలిగిస్తాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం అంటున్నారు. మరి ఎలాంటి మొక్కలు అదృష్టాన్ని కలిగిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనం ఇంట్లోనే పెంచుకునే మొక్కలలో తులసి మొక్క ఒకటి. హిందువుల ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఈ తులసి మొక్క ఉంటుంది.
తులసి మొక్కను పూజించడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. తులసి మొక్కను పూజించడం వల్ల తులసి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అలాగే విష్ణువు అనుగ్రహం కూడా కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఈ మొక్క ప్రతికూల శక్తులను దూరం చేస్తుందట. తులసి ఆకులను తింటే దగ్గు, జలుబు వంటివి తగ్గుతాయట. అంతేకాదు ఈ ఆకులు గాయాలను నయం చేయడంలోనూ ఉపయోగపడతాయని చెప్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కలను మీ ఇంటి తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచాలి. అలాగే మీ ఇంట్లో ఉండాల్సిన మొక్కలలో వెదురు మొక్క కూడా ఒకటి. చాలామంది ఇంట్లో అలాగే ఆఫీస్ లో డెస్క్ టాప్ లపై ఈ వెదురు మొక్కను పెంచుకుంటూ ఉంటారు. ఈ వెదురు మొక్క ప్రతికూల శక్తులను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే దీనిని అదృష్టంగా పరిగణిస్తూ ఉంటారు.
ఈ మొక్క రెండు కాండాలు జంటలకు వైవాహిక ఆనందాన్ని ఆశీర్వదిస్తాయి. మూడు కాండాలు పెరుగుదల ఆనందం కోసం అయితే ఐదు కాండాలు మంచి ఆరోగ్యం విజయాన్ని తెస్తాయట. మొత్తం కుటుంబం యొక్క మొత్తం అభివృద్ధి, మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తున్నందున ఒకరికి ఏడు కాండాలు కూడా ఉండవచ్చు. ఈ మొక్కను మీ ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచాలి. మంచి ఆరోగ్యాన్ని పొందటానికి మీరు తూర్పు దిశలో ఉంచవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా మన అదృష్టాన్ని పెంచే మొక్కలలో మనీ ప్లాంట్ కూడా ఒకటి. దాదాపుగా చాలా రకాల ఆఫీసులలో వ్యాపార స్థలాలలో ఇళ్లలో తప్పనిసరిగా ఈ మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క ఎంత బాగా పెరిగితే అంత అభివృద్ధి ఉంటుందని ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ మొక్కను చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు.
ఒత్తిడితో బాధపడేవారు తమ ఇంటిలో లేదా వారి కార్యాలయంలో మనీ ప్లాంట్ ఉంచాలి. మీరు మొక్కను ఒకే దిశలో ఉంచవచ్చు. అయితే, మీరు మీ ఇంటి వెలుపల మొక్కను ఉంచకూడదు, అదేవిధంగా మన ఇంట్లో ఉండాల్సిన మొక్కలలో కలబంద మొక్కకూడా ఒకటి. ఈ మొక్కను చాలామంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. కొందరు పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఈ మొక్కను ఉత్తరం మీద తూర్పు దిశలో ఉంచడం వల్ల అంతా మంచే జరుగుతుందని అదృష్టం కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు. అలాగే లోటస్ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. తామర పువ్వు మొక్క ఉంటే లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లో నివసిస్తుందని చెబుతున్నారు. లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం. కాబట్టి తామర పువ్వును ఇంట్లో పెంచుకోవడం వల్ల అదృష్టం కూడా కలిసి వస్తుందట.
తామర మొక్కలు మీ జీవితంలో శ్రేయస్సు మరియు శాంతిని కలిగిస్తాయి. ఆధ్యాత్మికతలో ఉన్నవారు ఈ మొక్కను వారి ఇళ్లలో ఉంచవచ్చు. అలాగే ఇంట్లో జాస్మిన్ మొక్కను కూడా పెంచుకోమని చెబుతున్నారు పండితులు. ఈ మొక్క ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణం మొత్తం ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు సువాసన భరితంగా ఉంటుందట. ఈ మొక్క సువాసన ఎవరినైనా ఆకర్షించగలదట. కాబట్టి సానుకూల శక్తిని ప్రేరేపించడం కోసం, ఇంటి వాతావరణం మెరుగుపరచడం కోసం జాస్మిన్ ప్లాంట్ ను ఇంట్లో పెంచాలని చెబుతున్నారు..
Related News
PM-KISAN Yojana: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం.. 18వ విడత పొందాలంటే..?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. దీనితో పాటు భూమి ధృవీకరణను కూడా పూర్తి చేయడం తప్పనిసరి.