HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Contesting Jharkhand Election Lalu Prasad Yadav

Jharkhand : జార్ఖండ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం : లాలూ ప్రసాద్ యాదవ్

Jharkhand : జార్ఖండ్‌లోని మొత్తం 81 స్థానాలకుగాను 70 స్థానాల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ బరిలో దిగుతాయని శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ప్రకటించారు. మిగతా 11 స్థానాల్లో ఆర్జేడీ, వామపక్షాలు లాంటి ఇతర మిత్రపక్షాలు పోటీపడుతాయని చెప్పారు.

  • Author : Latha Suma Date : 20-10-2024 - 5:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Contesting Jharkhand Election : Lalu Prasad Yadav
Contesting Jharkhand Election : Lalu Prasad Yadav

Lalu Prasad Yadav : నవంబర్‌లో జరగనున్న జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నామని రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాలకుగాను 70 స్థానాల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ బరిలో దిగుతాయని జార్ఖండ్‌ సీఎం ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. మిత్రపక్షాలను సంప్రదించకుండానే జేఎంఎం, కాంగ్రెస్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాయని అన్నారు.

జార్ఖండ్‌లోని మొత్తం 81 స్థానాలకుగాను 70 స్థానాల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ బరిలో దిగుతాయని శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ప్రకటించారు. మిగతా 11 స్థానాల్లో ఆర్జేడీ, వామపక్షాలు లాంటి ఇతర మిత్రపక్షాలు పోటీపడుతాయని చెప్పారు. అయితే ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే విషయాన్ని మిత్రపక్షాలతో చర్చించిన తర్వాత ప్రకటిస్తామని అన్నారు. గత ఎన్నికల్లో జేఎంఎం 30, కాంగ్రెస్‌ 16, ఆర్జేడీ 1 స్థానంలో గెలిచాయి. సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశాయి.

కాగా జార్ఖండ్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే వచ్చే నెలలో పోలింగ్‌ జరగనుంది. మహారాష్ట్రలోని అన్ని స్థానాలకు ఒకే విడతలో నవంబర్‌ 20న పోలింగ్‌ జరగనుండగా.. జార్ఖండ్‌లో మాత్రం నవంబర్‌ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. నవంబర్‌ 23న రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

Read Also: Delhi : ఢిల్లీ ఐఏఎస్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఘటన..రేపు సుప్రీంకోర్టులో విచారణ..!

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aassembly elections
  • congress
  • jharkhand
  • JMM
  • Lalu Prasad Yadav

Related News

Survey

ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

    Latest News

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

    Trending News

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd