HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Congress Maha Pathanam 2024

Maharashtra Elections Results : కాంగ్రెస్ ‘మహా’ పతనం..కర్ణాటక, తెలంగాణ ఎఫెక్టేనా..?

Maharashtra Elections Results : గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పతనాన్ని చూసింది. కేవలం 16 సీట్లకే పరిమితమైంది. 1990లో 141 స్థానాల్లో విజయం సాధించగా, 1995లో 80, 1999లో 75, 2004 లో 69, 2009 లో 82, 2014 లో 42, 2019లో 44 సీట్లను గెలుచుకుంది

  • Author : Sudheer Date : 24-11-2024 - 10:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahapathanam
Mahapathanam

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి(ఎన్​డీఏ) (Maharashtra Elections) విజయఢంకా మోగించింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను మించి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ (Congress)పతనాన్ని చూసింది. కేవలం 16 సీట్లకే పరిమితమైంది. 1990లో 141 స్థానాల్లో విజయం సాధించగా, 1995లో 80, 1999లో 75, 2004 లో 69, 2009 లో 82, 2014 లో 42, 2019లో 44 సీట్లను గెలుచుకుంది.

ఇప్పుడు 2024 లో 20 సీట్లలోపే రావడం కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రజల్లో ఆదరణ తగ్గడాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ కనీసం 20 స్థానాల్లో కూడా గెలవలేక చతికిలబడింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేని రీతిలో హస్తం పార్టీ ఆ రాష్ట్రంలో బలహీనపడింది. ఇదే దోరణి కొనసాగితే మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

రీసెంట్ గా జరిగిన లోక్‌సభ ఎ‌న్నికల్లో 99 స్థానాల్లో దక్కించుకుని బీజేపీకీ పూర్తి అధిక్యాన్ని దక్కకుండా చేయడంలో ముఖ్యభూమిక పోషించిన హస్తం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తేలిపోయింది. పొత్తులో భాగంగా 101 స్థానాల్లో బరిలో నిలిచిన కాంగ్రెస్‌ కనీసం 20 స్థానాల్లో కూడా విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో మహావికాస్ అఘాడీ కూటమి ఘోర ఓటమి చవిచూసింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మరో కారణం ..తెలంగాణ , కర్ణాటక కాంగ్రెస్ గెలుపే అని అంటున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినా తర్వాత ఎంత దారుణంగా మారాయనేది ఉదాహరణగా బిజెపి ప్రచారం చేయడం కూడా ఓటర్లలో భయం మొదలైందని తెలుస్తుంది. ఉచిత హామీల పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్..ఏడాది గడిచిన హామీలు నెరవేర్చకపోవడం , అభివృద్ధి అనేది పూర్తి లేకపోవడం, ఐటీ సైతం పడిపోవడం ఇవన్నీ కూడా ఓటర్లు ఆలోచించేలా బిజెపి చేసింది. ఇది కూడా కాంగ్రెస్ ఓటమికి కారణంగా చెప్పొచ్చు.

Read Also : PM Modi : ఈ నెల 29న విశాఖకు ప్రధాని మోడీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • Maharashtra Elections
  • Maharashtra Elections Results
  • Mahayuti

Related News

Telangana Government Good N

Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

దివ్యాంగుల సాధికారతలో భాగంగా ఇప్పటికే అమలు చేసిన పథకాల వివరాలను ఛైర్మన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తొలి విడతలో భాగంగా సుమారు 4,500 ఇందిరమ్మ ఇళ్లను దివ్యాంగుల కోటాలో కేటాయించగా,

    Latest News

    • IPL 2026 -RCB vs DC : ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో DC విజయం

    • NBK-Koratala Shiva : బాలకృష్ణ ను డైరెక్ట్ చేయబోతున్న కొరటాల ?

    • Ram : సొంతంగా కథ రాసుకున్న హీరో రామ్..మరి ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో ?

    • Coke Studio India : కోక్ స్టూడియో నుండి బుల్లెయా వే సాంగ్

    • Godrej Agrovet : లక్ష మంది మహిళా నిపుణులే లక్ష్యంగా గోద్రెజ్ ‘దిశ’

    Trending News

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

      • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

      • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd