CM Revanth Reddy : వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే దృశ్యాలు స్వయంగా చూశానని తెలిపారు. బాధితుల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 12:59 PM, Tue - 3 September 24
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో వరద పరిస్థితులపై ట్వీట్ చేశారు. గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే దృశ్యాలు స్వయంగా చూశానని తెలిపారు. బాధితుల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సర్కార్ ఎంతటి సాయం చేయడానికైనా సిద్దమని తెలిపారు. బాధితుల మొఖాలలో ఓవైపు తీరని ఆవేదన.. మరోవైపు అన్నా’ వచ్చాడన్న భరోసా కనిపించిందన్నారు.
గుండె కరిగిపోయే దృశ్యాలు…
మనసు చెదిరిపోయే కష్టాలు…
స్వయంగా చూశాను.బాధితుల మొఖాలలో …
ఒకవైపు తీరని ఆవేదన…
మరోవైపు “అన్నా” వచ్చాడన్న భరోసా.వీళ్ల కష్టం తీర్చడానికి…
కన్నీళ్లు తుడవడానికి…
ఎంతటి సాయమైనా
చేయడానికి సర్కారు సిద్ధం.#TelanganaRains2024 pic.twitter.com/0NQPobJsd5— Revanth Reddy (@revanth_anumula) September 3, 2024
We’re now on WhatsApp. Click to Join.
కాగా, సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద సహాయక చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని బాధితులకు సీఎం భరోసా కల్పించారు. ఈ క్రమంలోనే సీఎం మున్నేరు వరదకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అంతేకాక.. కూసుమంచి మండలం పాలేరు జలాశయం మినీ హైడల్ ప్రాజెక్ట్ వద్ద ఎడమ కాలువకు పడిన గండిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి, అధికారులని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి,ఎంపీ రఘురామిరెడ్డి వరద ప్రాంతాలని పరిశీలించారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలంలోని వరద బాధితులను పరామర్శించారు.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. వరద ప్రభావిత ప్రాంతాలు, పొలాలు, రోడ్లు పరిశీలించనున్నారు. వరదలో కొట్టుకుపోయి చనిపోయిన సైంటిస్టు అశ్విని కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
Read Also: Muda Case : 50:50 నిష్పత్తిలో కేటాయించిన స్థలాలను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్
Related News
Chakali Ailamma : కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు – సీఎం రేవంత్
Name of Chakali Ailamma for Kothi Women's University : కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు