CM Revanth Reddy : నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి హస్తినలో 2, 3 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు యాపీల్- ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారని సమాచారం.
- By Latha Suma Published Date - 04:39 PM, Thu - 15 August 24

CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. తాజాగాపెట్టుబడుల విషయమై రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం లేదా రాత్రి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా వైరాలో రేవంత్ రెడ్డి మూడో విడత రైతు రుణ మాఫీ నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం సభలో పాల్గొని రాత్రికి ఢిల్లీ పయనం కానున్నారు. రేవంత్ రెడ్డి హస్తినలో 2, 3 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు యాపీల్- ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
అటు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ పనులన్నీ పూర్తి అయిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. గురువారంతో రైతు రుణ మాఫీ పూర్తయింది. దీంతో వరంగల్ రైతు కృతజ్ఞత సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ సభలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. అలాగే రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది.
కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి అనేక పెట్టుబడులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రేవంత్ తన పర్యటనలో కొరియా టెక్స్‌టైల్ ఫెడరేషన్ ఛైర్మన్ కియాక్ సంగ్, వైస్ చైర్మన్ సొయాంగ్ జూ సహా 25 అగ్ర శ్రేణి టెక్స్‌టైల్ కంపెనీల అధినేతలతో మాట్లాడారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సీఎం అమెరికా పర్యటనలో రూ.31వేల 532 కోట్ల పెట్టుబడులను సాధించినట్టు ప్రభుత్వ పేర్కొంది.