CM Revanth Reddy : స్కిల్ యూనివర్సిటీ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ
స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ముసాయిదా కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు.
- By Latha Suma Published Date - 08:46 PM, Fri - 19 July 24

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు(శుక్రవారం) సాయంత్రం సచివాలయం(Secretariat)లో అధికారులతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్కిల్ యూనివర్సిటీ(Skill University) పై చర్చించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ముసాయిదా కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. ఢిల్లీ, హర్యానా తరహాలో తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి ముసాయిదాను అధికారులు సిద్ధం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ముసాయిదాలోని అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పలు సూచనలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, యూనివర్సిటీలో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమా కోర్సులకు సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎంకి అధికారులు వివరించారు. అంతేకాక కోర్సుల విషయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఇందుకు సంబంధించి ముందుగానే వివిధ కంపెనీలతో చర్చించి… ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా ముందుకు సాగాలన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి నిధుల విషయంలో మాత్రం రాజీపడవద్దన్నారు. మార్పులు, చేర్పులతో పూర్తిస్థాయి ముసాయిదాను సిద్ధం చేయాలన్నారు. యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణం పైనా కీలక సూచనలు చేశారు. శిక్షణ పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళిలు సిద్ధం చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ప్రొఫెసర్ కోదండరాం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read Also: Actor Suman : మంత్రి నారా లోకేష్ తో యాక్టర్ సుమన్ సమావేశం