CM Revanth Reddy : సివిల్స్ ర్యాంకర్ అనన్యరెడ్డిని సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
- Author : Latha Suma
Date : 20-04-2024 - 5:32 IST
Published By : Hashtagu Telugu Desk
Chief Minister Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం సివిల్స్ థర్ట్ ర్యాంకర్(Civils third ranker)అనన్యరెడ్డి(Ananya Reddy) కలిశారు. అనంతరం ఆయన ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణ విద్యార్థినికి వరుసగా రెండోసారి మూడో ర్యాంకు వచ్చింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు అరవై మంది విజేతలుగా నిలిచారు. మహబూబ్ నగర్‌కు చెందిన దోనూరి అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. దీంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి.
Read Also: Cheap Shopping Places: ఢిల్లీలోని సరసమైన షాపింగ్ ప్రదేశాలు
కాగా, సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపిన విషయ తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్ సర్వీసెస్ కు ఎంపికవటం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరు అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.