CM Revanth Reddy : తెలంగాణకు భారీ రుణ భారం సవాల్ గా మారింది: సీఎం రేవంత్ రెడ్డి
Economic Commission Group Meeting : దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని, భారీ రుణ భారం తెలంగాణకు సవాల్ గా మారింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తెలంగాణ అప్పు రూ.6.85 లక్షల కోట్లకు చేరింది. రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం రుణాల తిరిగి చెల్లింపులకే సరిపోతుంది అని తెలిపారు.
- By Latha Suma Published Date - 04:23 PM, Tue - 10 September 24

16th Economic Commission Group Meeting : ఈరోజు ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం బృందం సమావేశమైంది. చైర్మన్ అరవింద్ పనగారియా, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని, భారీ రుణ భారం తెలంగాణకు సవాల్ గా మారింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తెలంగాణ అప్పు రూ.6.85 లక్షల కోట్లకు చేరింది. రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం రుణాల తిరిగి చెల్లింపులకే సరిపోతుంది అని తెలిపారు.
అలా అయితే కేంద్రానికి సహకరిస్తాం..
ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్రానికి కేంద్ర మద్ధతు అవసరం చాలా ఉందన్నారు. రుణాల రీ స్ట్రక్చర్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. అదేవిధంగా ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో కేంద్రం నుంచి సహకారం కోరుతున్నాం. ఆర్థిక సంఘం సిఫార్సులు ఆ దిశగా ఉండాలని కోరుకుంటున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు తగినంత సహాయం అందిస్తే దేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నేరవేరుస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50%కి పెంచాలని కోరారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చితే దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ ఎంచుకున్న లక్ష్య సాధనకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని, తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం..
సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. కేంద్ర పథకాల కఠిన నిబంధనల కారణంగా వాటి ప్రయోజనాలు పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాలు తమ అవసరాలు కనుగుణంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్‌లను రూపొందించడానికి స్వయం ప్రతిపత్తిని కల్పించాలన్నారు. సెస్‌లు, సర్ చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని కోరారు. స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉన్నదన్నారు. తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం ఉందన్నారు. ఈ క్రమంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందని భట్టి అభిప్రాయం వ్యక్తం చేశారు.