HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Chalo Delhi These Are The Main Demands Of The Farmers

Delhi Chalo: ‘ఛలో ఢిల్లీ’.. రైతుల ప్రధాన డిమాండ్లు ఇవే..?

  • Author : Latha Suma Date : 13-02-2024 - 10:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
.jpg
'Chalo Delhi'.. These are the main demands of the farmers..?

 

Farmers Protest Delhi : పంజాబ్ రైతులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సుమారు 5 గంటలపాటు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ నిర్వహించేందుకు రైతులు సిద్ధమయ్యారు. నేడు (మంగళవారం) ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ధర్నా కోసం రైతుల సంఘాల నాయకులు, రైతులు దేశ రాజధాని ఢిల్లీ(delhi)కి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. 250కి పైగా రైతు సంఘాల మద్దతున్న ‘కిసాన్ మజ్దూర్ మోర్చా’, దాదాపు 150 సంఘాలతో కూడిన ‘కిసాన్ మోర్చా’ డిసెంబర్‌లోనే నిరసనకు పిలుపునివ్వడంతో పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు(delhi police) నగర సరిహద్దులు మూసివేశారు. ర్యాలీలు, నిరసనలపై నిషేధించారు. ఈ నేపథ్యంలో అపరిష్కృతంగా ఉన్న రైతుల ప్రధాన డిమాండ్ ఏవో ఒకసారి పరిశీలిద్దాం..

రైతుల ప్రధాన డిమాండ్లలో ప్రధానమైనది పంటలకు కనీస మద్దతు ధరకి హామీ ఇచ్చే చట్టం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్‌లో అనిశ్చితితో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు హామీ లభించాలని రైతులు కోరుతుకున్నారు. విద్యుత్ చట్టం 2020 రద్దు, లఖింపూర్ ఖేరీ(Lakhimpur Kheri) ఘటనలో మృతి చెందిన రైతులకు నష్టపరిహారం పరిహారం చెల్లింపు, రైతు ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసుల ఉపసంహరణ రైతుల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం పలు డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం హామీ ఇచ్చినా నెరవేర్చకపోవడంతో ధర్మా చేపట్టాలని రైతులు నిర్ణయించారు.

We’re now on WhatsApp. Click to Join.

2020-21 రైతు ఆందోళన సమయంలో రైతులపై నమోదయిన కేసు ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. తమ డిమాండ్లలో అత్యంత ముఖ్యమైన ‘కనీస మద్దత ధర’కు’ హామీ ఇవ్వాలని రైతులు పట్టుబడుతున్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ప్రభుత్వ నిబద్ధతపై రైతు సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర, రుణమాఫీ డిమాండ్ల విషయంలో స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలును పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని ప్రతిపాదించింది. అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఇక భూసేకరణ చట్టం-2013 పునరుద్దరణ, ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి ఉపసంహరణ కూడా రైతుల డిమాండ్లలో ప్రధానమైనవిగా ఉన్నాయి.

read also : Magunta : టిడిపిలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chalo Delhi
  • delhi
  • Delhi Chalo march
  • farmers

Related News

    Latest News

    • కుంకుమ పువ్వు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?.. ఎలా వాడాలి?

    • చలానా పడితే ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యే విధానం రావాలి: సీఎం రేవంత్ రెడ్డి

    • మారుతి కస్టమర్లకు కొత్త సౌకర్యం..ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో కార్ల సర్వీస్ కేంద్రాలు

    • ట్రంప్–మోదీల మధ్య విభేదాలు కూడా అలాంటివే : అమెరికా రాయబారి

    • చలికాలంలో ఆర్థరైటిస్ ఎందుకు పెరుగుతుంది?..సహజ ఆహారాలతో ఉపశమనం ఎలా పొందాలి?

    Trending News

      • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

      • విరాట్ కోహ్లీకి గ‌ర్వం ఉందా? ర‌హానే స‌మాధానం ఇదే!

      • 60,000 ఏళ్ల క్రితం నాటి బాణాలు ల‌భ్యం!

      • బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ!

      • కరూర్‌ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd