Jammu and Kashmir : జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం
మార్చి 16న సార్వత్రిక ఎన్నికలను ప్రకటించే కొద్ది రోజుల ముందు, లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు కమిషన్ చివరిసారిగా మార్చి 12 ,13న జమ్మూకశ్మీర్ ను సందర్శించింది.
- Author : Latha Suma
Date : 05-08-2024 - 2:38 IST
Published By : Hashtagu Telugu Desk
Central Election Commission: భారత ఎన్నికల సంఘం అధికారులు ఈ నెల 8 నుండి 10వ తేదీ వరకు జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) రాష్ట్రంలో పర్యటించనున్నారు. వచ్చే సెప్టెంబరు 30వ తేదీ లోపు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యపంథాలో ఎన్నికలు నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీచేసింది. ఈ గడువు సెప్టెంబరు 30వ తేదీతో ముగియనుంది. దీంతో జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకుప క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, ఎస్ఎస్ సంధు పర్యటిస్తారు. రాజకీయ పార్టీలతో తొలుత కమిషన్ సమావేశమవుతుంది. సీఈవో, ఎస్పీఎనోవో, సెంట్రల్ ఫోర్సెస్ కోఆర్డినేటర్‌తోనూ సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో కమిషన్ సమావేశమై ఎన్నికల సన్నాహకాలను సమీక్షిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఆగస్టు 10వ తేదీన జమ్మూలో పర్యటించి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమావేశం అవుతుంది. అనంతరం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనుంది. సీఈసీ రాజీవ్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు, గత మార్చిలోనూ జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. ఆ సమయంలోనే యూటీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రజలకు, రాజకీయ పార్టీలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడంపైనా కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది.
కాగా, జమ్మూ కాశ్మీర్‌లో చివరి అసెంబ్లీ ఎన్నికలు 2014లో జరిగాయి..2018లో అసెంబ్లీని రద్దు చేశారు. రాబోయే ఎన్నికలు 2019లో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా సమయంలో ఏర్పడిన జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి మొదటి ఎన్నికలు. రద్దు చేయబడింది మరియు రాష్ట్రాన్ని రెండు యుటిలుగా విభజించారు. ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ, సెప్టెంబర్ 30, 2024లోగా J&K లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు గత ఏడాది ECని ఆదేశించింది.