CBSE Scholarship : ఇంటర్ లో 80 శాతం మార్కులొచ్చాయా ? స్కాలర్ షిప్ మీకోసమే
CBSE Scholarship : ఇంటర్ సెకండియర్ లో 80 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.
- Author : Pasha
Date : 17-10-2023 - 1:35 IST
Published By : Hashtagu Telugu Desk
CBSE Scholarship : ఇంటర్ సెకండియర్ లో 80 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్. వారిలో అర్హులైన వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్కాలర్ షిప్ లను అందిస్తోంది. మంచి మార్కులతో ఇంటర్ లో పాసై , డిగ్రీ లేదా ఏదైనా ఉన్నత విద్యా కోర్సులో చేరిన విద్యార్థులు ఈ ఉపకారవేతనానికి అప్లై చేయొచ్చు. డిస్టెన్స్, కరస్పాండెన్స్ కోర్సుల్లో చేరినవారు కూడా ‘CBSE సెంట్రల్ సెక్టార్ స్కీమ్ స్కాలర్షిప్’ కోసం అప్లై చేయొచ్చు.
We’re now on WhatsApp. Click to Join
- ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే వారి కుటుంబం వార్షిక ఆదాయం రూ. 4.5 లక్షలలోపు ఉండాలి.
- దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మరే ఇతర స్కాలర్షిప్ ద్వారా ప్రయోజనాన్ని, ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని పొందకుండా ఉండాలి.
- డిప్లొమా కోర్సులో చేరిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అర్హులు కాదు.
- ఈ స్కాలర్ షిప్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తును సమర్పించాలి.
- ఈ అప్లికేషన్ సమర్పించేందుకు లాస్ట్ డేట్ డిసెంబర్ 31.
- పూర్తి వివరాలను scholarships.gov.in వెబ్ సైట్లో చూడొచ్చు. ఈ వెబ్ సైట్ హోమ్‌పేజీలో CBSE CSSS స్కాలర్షిప్ పథకం 2023 అనే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ ను నింపి, అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.