Jeep Washed Away : వాగులో కారు గల్లంతు…గల్లంతైన వారిలో ఓ టీవీ ఛానెల్ స్ట్రింగర్..!!
తెలంగాణ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి రామోజీపేట వాగులో కారు కొట్టుకుపోయింది.
- Author : hashtagu
Date : 12-07-2022 - 11:24 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి రామోజీపేట వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గల్లంతైన వ్యక్తి ఓ ఛానెల్ కు చెందిన స్ట్రింగర్ జమేర్ గా తెలుస్తోంది. అతనితో పాటు కారులో ఉన్న మరో వ్యక్తి షమీ సురక్షితంగా బయటపడ్డాడు.
వాగులో కొంత దూరం కొట్టుకుపోయి చెట్టు కొమ్మలు పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు షమీ. సమాచారం అందకున్న రెస్య్కూ టీం ఘటనాస్థలానికి చేరుకుని జమీర్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించింది. బోర్నపల్లికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రామోజీపేట వాగు ఉద్రిక్తంగా ప్రవహిస్తుండటంతో…ఈ ఘటన చోటుచేసుకుంది.