Belarus President Poisoned : పుతిన్ ను కలిసొచ్చాక.. బెలారస్ ప్రెసిడెంట్ కు సీరియస్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో బెలారస్ అధ్యక్షుడు(Belarus President Poisoned) అలెగ్జాండర్ లుకషెంకో మాస్కో లో భేటీ అయ్యారు.
- By Pasha Published Date - 04:27 PM, Mon - 29 May 23

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో బెలారస్ అధ్యక్షుడు(Belarus President Poisoned) అలెగ్జాండర్ లుకషెంకో మాస్కో లో భేటీ అయ్యారు. వీళ్లిద్దరి మీటింగ్ నాలుగు గంటలపాటు ఏకాంతంగా ఒక హాల్ లో జరిగింది. మీటింగ్ ముగించుకొని బయటకు వచ్చిన కొంత సమయానికే ఆందోళనకర పరిణామం చోటు చేసుకుంది. 68 ఏళ్ళ లుకషెంకోకు తీవ్ర గుండె పోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయన్ను మాస్కోలోని సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పుతిన్ తో లుకషెంకో సుదీర్ఘ భేటీ తర్వాత ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Also read : Ukraine: పుతిన్ హత్యకు ఉక్రెయిన్ కుట్ర?!
బెలారస్ ప్రతిపక్ష నేత వాలెరీ టెప్ కాలో సైతం దీనిపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీని వెనుక రష్యా అధ్యక్ష కార్యాలయం హస్తం ఉండొచ్చన్న టాక్ అంతర్జాతీయ మీడియాలో వినిపిస్తోంది. లుంక షెంకో ఆరోగ్యం కొన్ని రోజులుగా బాగా లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయన రక్త శుద్ధి, తదితర చికిత్సలు చేయించు కుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం లుకషెంకో ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు.ఈనెల 9న మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో జరిగిన విక్టరీ డే వేడుకలకు బెలారస్ ప్రెసిడెంట్ లుకషెంకో హాజరు కాలేదు. దీంతో ఆయన అప్పట్లో ఒక ట్వీట్ చేశారు. ‘‘నేనేమీ మరణించడం లేదు ఫ్రెండ్స్. నాతో చాలా కాలం పాటు వేగాల్సి ఉంటుంది’’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, లుకషెంకో(Belarus President Poisoned) రష్యాతో సన్నిహితంగా మెలిగారు. ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో పుతిన్‌కు మద్దతుగా నిలిచారు.