Bank of Baroda : సీఎం రేవంత్ రెడ్డికి రూ.కోటి విరాళం చెక్ అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా
Bank of Baroda : వరద బాధితుల సహాయం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. సచివాలయం, సీఎం నివాసంలో విరాళాల చెక్కులను అందజేస్తున్నారు.
- By Latha Suma Published Date - 01:53 PM, Thu - 24 October 24

CM Revanth Reddy : ముఖ్యమంత్రి సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.కోటి విరాళం అందజేసింది. ఈ మేరకు గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ కలిశారు. సీఎం సహాయ నిధి విరాళ చెక్కును అందించారు. వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల చెక్ ను విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. వరద బాధితుల సహాయం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. సచివాలయం, సీఎం నివాసంలో విరాళాల చెక్కులను అందజేస్తున్నారు. ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నారు. కొందరు తమ మంత్రుల ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ విరాళాల చెక్కులను అందజేస్తున్నారు.
తాజాగా.. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.18.69 కోట్ల చెక్కును అందించారు. విద్యుత్ శాఖకు చెందిన 70,585 మంది ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఒకరోజు వేతనం రూ.18.69 కోట్లను చెక్కు రూపంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్‌పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ అలీ, జెఎండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడా తమ విరాళాలను సీఎం సహాయ నిధికి అందజేస్తున్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలోని ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించి, ఉమ్మడిగా విరాళం చెక్కును అందజేస్తారు.