Gurla : పోలీసులపై జగన్ ఆగ్రహం..
Gurla : 'పోలీసులు కనీసం కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు. ప్రతిపక్ష నాయకుడు వచ్చి మీడియాతో మాట్లాడే పరిస్థితిని కల్పించకపోతే ఎలా?
- By Sudheer Published Date - 01:49 PM, Thu - 24 October 24

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (Jagan)..గుర్ల(Gurla)లో పోలీసుల(Police)పై ఆగ్రహం వ్యక్తం చేసారు. గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను జగన్ ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చి.. ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గుర్ల మండలంలో సెప్టెంబరు నెలలోనే డయేరియా మృత్యు ఘంటికలు మోగాయి. ఒకరిద్దరు కాదు ఏకంగా 14 మందిని బలి తీసుకుంది.కలుషిత నీరు కారణంగా పలువురు వాంతులు, విరేచనాలతో గత నెలలోనే అనేకమంది ఆస్పత్రులకు వచ్చారు. గత నెల మూడో వారంలోనే మండలంలోని పెనుబర్తి గ్రామంలో డయేరియాకు ఒకరు మృతి చెందారు.
ఈ విషయాలను జగన్ మీడియా తో ప్రస్తావిస్తుండగా..అక్కడి జనాలు మీదకు దూసుకొస్తుండడం..జగన్ ను మాట్లాడకుండా చేస్తుండడం తో జగన్..పోలీసుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘పోలీసులు కనీసం కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు. ప్రతిపక్ష నాయకుడు వచ్చి మీడియాతో మాట్లాడే పరిస్థితిని కల్పించకపోతే ఎలా? కనీసం భద్రత ఇవ్వకపోతే ఎలా? పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ఆగ్రహించారు. ఇక గుర్ల లో జగన్‌కు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్దకు భారీ సంఖ్యలో మద్దతుదారులు జగన్ కోసం వచ్చారు.
Read Also : BJP Maha Dharna : రేపు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా – బండి సంజయ్