Atchutapuram: అచ్యుతాపురంలోని సెజ్‌లో గ్యాస్ లీక్.. అస్పత్రిపాలైన ప్రజలు!
- Author : Anshu
Date : 03-06-2022 - 4:25 IST
Published By : Hashtagu Telugu Desk
తాజాగా అచ్యుతారపురంలో గ్యాస్ లీకేజి ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. సెజ్‌లోని పోరస్ అనే కంపెనీ నుంచి అమ్మోనియం గ్యాస్ లీక్ అయినట్టు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో చుట్టూ పక్కన ప్రాంతాలకు చెందిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తల తిరగడంతో తీవ్ర ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. దీనితో వెంటనే బాధితులను యలమంచిలి, అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.
వెంటనే స్పందించిన ప్రస్తుతం 20 అంబులెన్స్‌లతో సహాయక చర్యలు చేపట్టింది. ఘటన స్థలానికి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గ్యాస్ లీకేజీ ఘటన పై హోంమంత్రి వనిత ఆరా తీశారు. హోంమంత్రి వనిత ఆరా ఈ విషయం పై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో హోంమంత్రి సమీక్షించారు. అనంతరం సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆమె ఆదేశాలను జారీ చేసింది. గ్యాస్ పీల్చి ఇబ్బందిపడ్డ 32 మంది బాదితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆమె తెలిపారు. అదే విధంగా గ్యాస్ లీక్ అవుతున్న పరిశ్రమని అధికారులు కంట్రోల్ లోకి తీసుకోవాలని ఆదేశించారు.