Rahul Kejriwal Meet : రాహుల్ గాంధీతో కేజ్రీవాల్ మీటింగ్.. దేనిపై అంటే ?
Rahul Kejriwal Meet : ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.
- By pasha Published Date - 11:45 AM, Fri - 26 May 23

Rahul Kejriwal Meet : ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఇప్పటికే విపక్షాలకు చెందిన పలువురు ముఖ్య నేతలను ఆయన స్వయంగా కలిశారు. రాజ్యసభలో విపక్ష పార్టీలకు మెజార్టీ ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ కు సంబంధించి రాజ్యసభలో జరిగే ఓటింగ్ లో ఆ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఓటింగ్ వేయాలని విపక్ష నేతలను ఢిల్లీ సీఎం కోరుతున్నారు. రాజ్యసభలో అన్ని విపక్ష పార్టీల కంటే అత్యధిక సంఖ్యలో ఎంపీలు కలిగిన కాంగ్రెస్ మద్దతుపై ఇప్పుడు కేజ్రీ వాల్ ఫోకస్ చేశారు. ఈక్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో ఆయన త్వరలోనే భేటీ(Rahul Kejriwal Meet) కానున్నారు. ఇవాళ (శుక్రవారం) ఉదయమే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ అడిగానంటూ అరవింద్ కేజ్రీ వాల్ ట్వీట్ చేశారు. అయితే ఈ నేతల మధ్య కీలక భేటీకి ఎప్పుడు టైం ఫిక్స్ అవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.
Sought time this morning to meet Cong President Sh Kharge ji and Sh Rahul Gandhi ji to seek Cong support in Parl against undemocratic n unconstitutional ordinance passed by BJP govt and also to discuss general assault on federal structure and prevailing political situation
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 26, 2023
Also read : Rahul Gandhi Truck Ride: ట్రక్కు డ్రైవర్ గా మారిన రాహుల్
కాంగ్రెస్ అగ్ర నేతలు అపాయింట్మెంట్ ఇస్తారా ?
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి అరవింద్ కేజ్రీ వాల్ ను కాంగ్రెస్ ఆహ్వానించలేదు. అయితే ఇప్పుడు కేంద్ర సర్కారు ఆర్డినెన్స్ విషయంలో స్వయంగా కేజ్రీ వాలే కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తుండటం(Rahul Kejriwal Meet) మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతంగా రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు. అయితే అరవింద్ కేజ్రీ వాల్ కు అపాయింట్ మెంట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు కోటలా ఉన్న ఢిల్లీలో ఆప్ విజయం సాధించింది. ఈ దృష్ట్యా ఢిల్లీ కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే ఆ ఆర్డినెన్స్ విషయంలో ఆప్ కు మద్దుతు పలకాలా ? వద్దా ? అనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.

Tags
- arvind kejriwal
- battle with centre
- meeting
- ordinance
- rahul gandhi
- Rahul Kejriwal Meet
- rajya sabha voting

Related News

Rahul in US: అమెరికాలో సెంగోల్ పై రాహుల్ గళం
సెంగోల్ గురించి మాట్లాడుతూ కోపం మరియు ద్వేషం వంటి సమస్యలను ప్రధాని మోదీ అతని ప్రభుత్వం పరిష్కరించలేవని రాహుల్ గాంధీ(Rahul in US) అన్నారు.