Rahul Gandhi Truck Ride: ట్రక్కు డ్రైవర్ గా మారిన రాహుల్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతుంది
- By Praveen Aluthuru Published Date - 11:29 AM, Tue - 23 May 23

Rahul Gandhi Truck Ride: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమదైన స్టైల్ లో ప్రచార కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నారు. ఇటీవల ప్రియాంక గాంధీ తెలంగాణ గడ్డపై అడుగుపెట్టింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా రాహుల్ గాంధీ ఢిల్లీ రోడ్లపై హల్చల్ చేశారు. ఢిల్లీ రోడ్లపై ట్రక్కు నడుపుతూ వార్తల్లోకెక్కారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఈ మధ్య భిన్నమైన మూడ్‌లో కనిపిస్తున్నారు. కొన్నిసార్లు రాహుల్ ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ, కొన్నిసార్లు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ఆ వీడియోలు గతంలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్రక్కును నడుపుతూ కనిపించాడు. ఢిల్లీలో ట్రక్కు ఎక్కిన రాహుల్ అంబాలా మీదుగా చండీగఢ్ చేరుకున్నారు. రాహుల్ గాంధీ ట్రక్కును నడుపుతున్న వీడియో పలువురిని ఆకట్టుకుంటుంది. ఈ వీడియోను కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అంబాలాలో ట్రక్కు డ్రైవర్లను రాహుల్ కలిశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేశారు.
Rahul Gandhi in a truck. Talking and listening to the problems of drivers at late night ❣️ pic.twitter.com/V3TlBuArDM
— Darshni Reddy (@angrybirdtweetz) May 22, 2023
అదే క్రమంలో కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే రాహుల్ గాంధీ వీడియోను షేర్ చేశారు. సుప్రియ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఈ మధ్య క్రీడాకారులు, సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమవుతున్న యువత, రైతులు, డెలివరీ బాయ్స్, బస్సుల్లో సాధారణ పౌరులను ఇప్పుడు అర్ధరాత్రి ట్రక్ డ్రైవర్లను కలిశారని పేర్కొన్నారు. ఎందుకంటే ఈ దేశ ప్రజల సమస్యలను రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలనుకుంటున్నాడని, అందుకే రాహుల్ గాంధీ ప్రజల మధ్య సమయం గడుపుతున్నట్టు సుప్రియా తెలిపారు.
Read More: Mumbai: “ముంబైని అతి త్వరలో పేల్చబోతున్నా”.. పోలీసుల అదుపులో నిందితుడు