Aamir Khan Marriage : త్వరలో అమీర్ ఖాన్ మూడో పెళ్లి ?
మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ త్వరలోనే మూడో పెళ్లి (Aamir Khan Marriage) చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- Author : Pasha
Date : 28-05-2023 - 2:02 IST
Published By : Hashtagu Telugu Desk
మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ త్వరలోనే మూడో పెళ్లి (Aamir Khan Marriage) చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దంగల్ మూవీలో అమీర్‌కు కూతురిగా ఫాతిమా సనాషేక్ యాక్ట్ చేసింది. అప్పటి నుంచి వీళ్ళు ఇద్దరూ పలుమార్లు మీడియా కంట పడ్డారు. ఇటీవల అమీర్ కూతురు ఇరాఖాన్ ఎంగేజ్‌మెంట్ వేడుకలోనూ ఫాతిమా సందడి చేసింది. రీసెంట్ గా ముంబైలో వీరిద్దరూ కలిసి పికిల్ బాల్ ఆడారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో.. మరోసారి అమీర్ ఖాన్ పెళ్లి (Aamir Khan Marriage) వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.
Also read : Ira Khan : ఘనంగా అమీర్ ఖాన్ కూతురు నిశ్చితార్థం..ఫొటోలు వైరల్..!!
ఇదిలా ఉంటే అమీర్‌తో లింకప్ వార్తలపై ఫాతిమా గతంలోనే ఒక ఇంటర్వ్యూలో స్పందించింది. ఇలాంటి రూమర్స్ వల్ల మొదట్లో తాను ఎఫెక్ట్ అయిన్లు చెప్పిన ఫాతిమా.. ఇంత పెద్ద స్థాయిలో ఈ తరహా రూమర్స్‌ను తాను ఎప్పుడూ ఫేస్ చేయలేదని పేర్కొంది. భారీ అంచనాల మధ్య విడుదలైన లాల్ సింగ్ చద్దా ఘోర పరాజయం చెందడంతో సినిమాలకు అమీర్ ఖాన్ బ్రేక్ ఇచ్చాడు. 1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్న అమీర్.. 2002లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత లగాన్ షూటింగ్‌లో పరిచయమైన కిరణ్ రావును 2005లో పెళ్లి చేసుకోగా 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అమీర్, కిరణ్ రావులకు ఒక కుమారుడు ఉన్నాడు.