HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >300 People Stranded In Uttarakhand After Massive Landslide Cuts Off Road

300 People Stranded: కొండచరియల కల్లోలం.. చిక్కుకుపోయిన 300 మంది

లిపులేఖ్ - తవాఘాట్ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకు పోయింది. దీంతో ఆ రూట్ లో ప్రయాణంలో ఉన్న కనీసం 300 మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.

  • Author : Pasha Date : 01-06-2023 - 11:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Landslide
300 People Trapped In Landslides

300 People Stranded in Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో లిపులేఖ్ – తవాఘాట్ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకు పోయింది. దీంతో ఆ రూట్ లో ప్రయాణంలో ఉన్న కనీసం 300 మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. లఖన్‌పూర్ సమీపంలో కొండ చరియలు పెద్దఎత్తున విరిగి రోడ్డుపై పడటంతో.. లిపులేఖ్ – తవాఘాట్ రహదారిని మూసివేశారు. ఆ రూట్ లో జర్నీ చేస్తున్న ప్రయాణికులు ధార్చుల, గుంజి ప్రాంతాల్లో చిక్కుకు పోయారు. రెండు రోజుల తర్వాత ఈ రహదారిలో ట్రాఫిక్ రాకపోకలు మొదలయ్యే ఛాన్స్ ఉంది.

యమునోత్రి మరియు గంగోత్రి ధామ్ యాత్రకు వచ్చే భక్తులందరూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని స్థానిక పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.”యాత్రికులు దయచేసి సురక్షిత ప్రదేశాలలో ఉండండి. అనవసరంగా ప్రయాణించవద్దు. సురక్షిత ప్రదేశాలలో వాహనాలను పార్క్ చేయండి. వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణించండి” అని వార్నింగ్ ఇచ్చారు. “యమునోత్రి మరియు గంగోత్రి ధామ్ యాత్రకు వచ్చే భక్తులందరూ వాతావరణ సూచన తీసుకున్న తర్వాత తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. ప్రయాణ సమయంలో రెయిన్ కవర్, గొడుగు మరియు ఉన్ని/వెచ్చని దుస్తులను తమతో ఉంచుకోవాలి” అని నిర్దేశించారు.

ఉత్తరాఖండ్‌లోని అల్మోరా, బాగేశ్వర్, చమోలి, చంపావత్, డెహ్రాడూన్, గర్వాల్, హార్ద్వార్, నైనిటాల్, పితోర్‌గఢ్, రుద్రప్రయాగ్, తెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్ మరియు ఉత్తరకాశీ జిల్లాల్లో దుమ్ము తుఫాను, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read:  Condoms to Funerals: అంత్యక్రియలకూ కండోమ్ తీసుకెళ్తున్నారట.. ఎందుకంటే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 300 people
  • Cuts Off Road
  • devotees
  • landslide
  • Lipulekh-Tawaghat road
  • Pilgrims
  • Stranded
  • uttarakhand
  • Yamunotri and Gangotri Dham Yatra

Related News

Arrangements for Mandala Puja in Sabarimala..Special features of Mandala Puja day..!

శబరిమలలో మండల పూజకు ఏర్పాట్లు..మండల పూజ రోజు విశేషాలు..!

ప్రతి ఏడాది లక్షలాది భక్తులు ఎదురుచూసే ఈ పవిత్ర కార్యక్రమం ఈ నెల 27వ తేదీన ఉదయం 10.10 గంటల నుంచి 11.30 గంటల వరకు కొనసాగనుంది. మండల పూజ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడనుండగా, ఆధ్యాత్మిక వాతావరణం శబరిమల కొండలంతా వ్యాపించనుంది.

    Latest News

    • బాబు పై కేసుల కొట్టివేత, వైసీపీ నేతల ఏడుపు బాట

    • రాజా సాబ్ టీం పై ఫ్యాన్స్ ఫైర్

    • తెలంగాణ లో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు

    • మిస్ టీన్ ఇండియా పోటీల్లో కిరీటం గెలుచుకున్న పానీ పూరి అమ్మే వ్యక్తి కుమార్తె

    • కొండెక్కిన గుడ్డు ధర.. మధ్యాహ్న భోజనంలో గుడ్డు బంద్

    Trending News

      • ఊడిపోయిన జుట్టును అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

      • సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మరో 3 సెంచరీలు చేస్తే చరిత్రే!

      • 2025లో బంగారం, వెండి ధరల జోరు.. కొత్త సంవ‌త్స‌రంలో ఎలా ఉండ‌బోతుంది?!

      • శ్రేయస్ అయ్యర్ గాయంపై బిగ్ అప్‌డేట్.. త్వరలోనే జ‌ట్టులోకి పునరాగమనం?

      • విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్, విరాట్ సెంచరీలు.. ప్రత్యక్ష ప్రసారం ఎందుకు లేదు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd