HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >2025 India Justice Report Released

IJR : 2025 ఇండియా జస్టిస్ రిపోర్ట్ (IJR) విడుదల

మొత్తం మీద 18 పెద్ద, మధ్య తరహా రాష్ట్రాలలో (ఒక్కొక్కటి కోటి కంటే ఎక్కువ జనాభాతో) 3వ స్థానంలో (2022: 3వ స్థానంలో) ఉంది. జైళ్లలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో, చట్టపరమైన సహాయంలో 5వ స్థానంలో ఉండగా, మొత్తం మీద 18 పెద్ద, మధ్య తరహా రాష్ట్రాలలో 2వ స్థానంలో (2022: 5వ స్థానంలో) నిలిచింది.

  • By Latha Suma Published Date - 06:52 PM, Tue - 15 April 25
  • daily-hunt
2025 India Justice Report released
2025 India Justice Report released

IJR : దేశంలో న్యాయం అందించడానికి సంబంధించి భారతదేశంలో రాష్ట్రాలకు ర్యాంకింగ్ అందించే ఏకైక నివేదిక అయిన 2025 ఇండియా జస్టిస్ రిపోర్ట్ (IJR) ఈరోజు విడుదలైంది. తెలంగాణ పోలీసు రంగంలో 1వ స్థానంలో, న్యాయవ్యవస్థలో 2వ స్థానంలో ఉంది. మొత్తం మీద 18 పెద్ద, మధ్య తరహా రాష్ట్రాలలో (ఒక్కొక్కటి కోటి కంటే ఎక్కువ జనాభాతో) 3వ స్థానంలో (2022: 3వ స్థానంలో) ఉంది. జైళ్లలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో, చట్టపరమైన సహాయంలో 5వ స్థానంలో ఉండగా, మొత్తం మీద 18 పెద్ద, మధ్య తరహా రాష్ట్రాలలో 2వ స్థానంలో (2022: 5వ స్థానంలో) నిలిచింది.

కర్ణాటక అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ 2022లో ఐదవ స్థానం నుండి రెండో స్థానానికి చేరుకుంది. తెలంగాణ (2022 ర్యాంకింగ్: 3వ స్థానం), కేరళ (2022 ర్యాంకింగ్: 6వ స్థానం) ఉన్నాయి. ఏడు చిన్న రాష్ట్రాలలో (ఒక్కొక్కటి కోటి కంటే తక్కువ జనాభా ఉన్నవి), సిక్కిం (2022: 1వ) మొదటి స్థానంలో, హిమాచల్ ప్రదేశ్ (2022: 6వ), అరుణాచల్ ప్రదేశ్ (2022: 2వ) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇండియా జస్టిస్ రిపోర్ట్ (IJR) ను మొదట టాటా ట్రస్ట్స్ ప్రారంభించింది, మొట్టమొదటి ర్యాంకింగ్ 2019 లో ప్రచురించబడింది. సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, DAKSH, TISS–Prayas, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, ఐజేఆర్ డేటా భాగస్వామి అయిన హౌ ఇండియా లివ్స్ వంటి భాగస్వాముల సహకారంతో ఇది ఈ నివేదిక నాల్గవ ఎడిషన్.

24 నెలల కఠోర పరిమాణాత్మక పరిశోధన ద్వారా, మునుపటి మూడు సందర్భాల్లో మాదిరిగానే ఐజేఆర్ 2025, తప్పనిసరి సేవలను సమర్థవంతంగా అందించడానికి వాటి న్యాయ పంపిణీ నిర్మాణాల సామర్థ్యాలను గుర్తించడంలో రాష్ట్రాల పనితీరును ట్రాక్ చేసింది. అధికారిక ప్రభుత్వ వనరుల నుండి తాజా అధికారిక గణాం కాల ఆధారంగా, ఇది న్యాయ పంపిణీ యొక్క నాలుగు స్తంభాలు – పోలీసు, న్యాయవ్యవస్థ, జైళ్లు, చట్ట పరమైన సహాయం- పై ఇతరత్రాగా వెలుగు లోకి రాని డేటాను ఒకచోట చేర్చింది. బడ్జెట్లు, మానవ వనరులు, పనిభారం, వైవిధ్యం, మౌలిక సదుపాయాలు, ధోరణుల (ఐదేళ్ల కాలంలో మెరుగుపరచాలనే ఉద్దేశ్యం) ద్వారా రాష్ట్రం స్వయంగా ప్రకటించిన ప్రమాణాలను బట్టి విశ్లేషించారు. ఈ ఎడిషన్ 25 రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ల సామర్థ్యాన్ని కూడా విడిగా అంచనా వేస్తుంది (మరిన్ని వివరాలకు SHRC సంక్షిప్త వివరణ చూడం డి) మరియు వైకల్యాలున్న వ్యక్తులకు మధ్యవర్తిత్వం, న్యాయం పొందడంపై వ్యాసాలను కలిగి ఉంటుంది.

ఇండియా జస్టిస్ రిపోర్ట్ గురించి జస్టిస్ (రిటైర్డ్) మదన్ బి. లోకూర్ మాట్లాడుతూ.. ‘‘ఒక వ్యక్తి వ్యవస్థతో ఎదు ర్కొనే మొదటి ఎన్‌కౌంటర్‌తోనే న్యాయం పొందడంలో శిక్షా ప్రక్రియ ప్రారంభమవుతుంది. న్యాయం అందించ డంలో ముందు వరుసలో ఉండే ఫ్రంట్‌లైన్ జస్టిస్ ప్రొవైడర్లు – పోలీస్ స్టేషన్లు, పారాలీగల్ వాలంటీర్లు, జిల్లా కోర్టులు – వంటి వారిని సరిగ్గా సమకూర్చడంలో, శిక్షణ ఇవ్వడంలో మనం విఫలమవడంతో, మనం ప్రజల నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాం. సమాన న్యాయం పట్ల మన నిబద్ధతను రూపొందించడానికి ఈ సంస్థలు ఉద్దేశించబడ్డాయి. మన మొత్తం న్యాయ చట్రం యొక్క బలం ఈ కీలకమైన మొదటి సంప్రదింపు అంశాలపై ఆధారపడి ఉంటుంది. వనరులపై తగినంత శ్రద్ధ పెట్టనందున మెరుగుదలలు చాలా తక్కువగా ఉన్నాయని ఇండియా జస్టిస్ రిపోర్ట్ నాల్గవ ఎడిషన్ ఎత్తి చూపింది. న్యాయం కోరుకునే వ్యక్తిపైనే భారం కొనసాగుతోంది, దానిని అందించడం రాజ్యం బాధ్యత కాదా’’ అని ప్రశ్నించారు.

‘‘భారతదేశం వందేళ్లుగా ప్రజాస్వామ్య, చట్టబద్ధమైన దేశంగా ముందుకు సాగుతున్నందున, సంస్కరించ బడిన న్యాయ వ్యవస్థ ద్వారా హామీ ఇవ్వబడకపోతే చట్టబద్ధమైన పాలన, సమాన హక్కుల వాగ్దానం శూ న్యంగా ఉంటుంది’’ అని ఇండియా జస్టిస్ రిపోర్ట్ చీఫ్ ఎడిటర్ శ్రీమతి మాజా దారువాలా అన్నారు. ‘‘సంస్కరణ ఐచ్ఛికం కాదు. ఇది అత్యవసరం. బాగా వనరులు కలిగి స్పందించే న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధమైన ఆవశ్యకత. దీనిని ప్రతి పౌరుడికి అందుబాటులో ఉన్న రోజువారీ వాస్తవికతగా చేయాలి’’ అని అన్నారు.

లింగం మరియు కులం ప్రాతినిధ్యం

2016 నుండి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ అధికారులలో 10% కంటే ఎక్కువ కొరత నమోదవుతుండగా, తెలంగాణలో ఎస్సీ అధికారులలో ఖాళీలు 2019లో 5% నుండి 2022లో 11%కి పెరిగాయి. ఎస్టీ కానిస్టేబుళ్లలో, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు 2019లో 6% నుండి 2022లో 11%కి పెరిగాయి. అదే విభాగంలో, 2019లో ఖాళీలు నమోదు కాని తెలంగాణ, ఇప్పుడు 15% లోటును నమోదు చేసింది. జిల్లా కోర్టు న్యాయమూర్తులలో ఎస్సీ న్యాయమూర్తులలో 9% ఖాళీలు ఉన్న ఆంధ్రప్రదేశ్, కోటాలను నెరవేరుస్తుండగా, తెలంగాణ 19% ఖాళీని నివేదించింది.

రెండు రాష్ట్రాలు జిల్లా కోర్టులలో 50% కంటే ఎక్కువగా మహిళల వాటాను నివేదించాయి – దేశంలోనే 55%తో తెలంగాణ అతిపెద్ద వాటాను కలిగి ఉంది. హైకోర్టులో అత్యధిక మహిళా వాటాతో (33%) ఆంధ్రప్రదేశ్ కంటే తెలం గాణ ముందుంది. పోలీసు రంగంలో ఆంధ్రప్రదేశ్ 22% మహిళల వాటాతో తెలంగాణ కంటే ముందుంది. ఇది దేశం లోనే అత్యధికం, తెలంగాణ 9% మహిళలతో ఉంది.

న్యాయ వ్యవస్థలో ఖాళీలు

2025 నాటికి, ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయమూర్తులలో 12% ఖాళీలను నమోదు చేసింది, ఇది దేశంలోనే అత్యల్ప మైనది. తెలంగాణలో ఇది 21%గా నమోదైంది. 2025లో హైకోర్టు స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ 2022 నుండి న్యాయ మూర్తులలో 19% ఖాళీల స్థాయిని నిలబెట్టుకోగలిగింది. అంతేకాకుండా హైకోర్టు సిబ్బందిలో అతిపెద్ద తగ్గుదల (51% నుండి 18% వరకు) నమోదు చేసింది. తెలంగాణలో హైకోర్టు న్యాయమూర్తులలో 29% ఖాళీలు, హైకోర్టు సిబ్బందిలో 24% ఖాళీలు నమోదయ్యాయి.

తెలంగాణ పోలీసు రంగంలో, జనవరి 2022 నుండి ఖాళీలు పెరిగాయి. జనవరి 2023లో, తెలంగాణలో కానిస్టేబు ళ్లలో 30% ఖాళీలు ఉన్నాయి, ఇది 26% నుంచి పెరిగింది. అధికారులలో 13% కొరత, ఇది 7% నుండి పెరిగింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుళ్లలో 21%, అధికారులలో 10% ఖాళీలు ఉన్నాయి

పోలీస్

రాజస్థాన్‌లో ఒక గ్రామీణ పోలీస్ స్టేషన్ 646 చదరపు కిలోమీటర్లు, గుజరాత్‌లో ఒక పట్టణ పోలీస్ స్టేషన్ 60 చదరపు కిలోమీటర్ల పరిధి కవర్ చేస్తుండగా, తెలంగాణలోని ప్రతి గ్రామీణ పోలీస్ స్టేషన్ (282 చదరపు కిలో మీటర్లు) మరియు పట్టణ పోలీస్ స్టేషన్ (10.6 చదరపు కిలోమీటర్లు) అత్యల్ప ప్రాంతాలను కలిగి ఉన్నాయి. శిక్షణా సంస్థకు 2,608 మంది పోలీసు సిబ్బందితో తెలంగాణ దేశంలోనే అత్యల్ప పనిభారాన్ని నివేదించింది. తన పోలీస్ స్టేషన్లలో 85% కంటే ఎక్కువ వాటికి సీసీటీవీలను, మహిళా హెల్ప్‌డెస్క్‌లను కలిగి ఉన్నట్లు కూడా తెలంగాణ నివేదించింది.

జైళ్లు

ఖైదీల కోసం ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా ఖర్చు చేసే రాష్ట్రంగా కొనసాగుతోంది. 2022-2023లో, ఖైదీకి ఏటా రూ. 2.6 లక్షలు లేదా 7,200 మంది ఖైదీ జనాభాకు రోజుకు రూ.733 ఖర్చు చేసింది. అదే సంవత్సరంలో, ఇలాంటి 6,500 మంది ఖైదీ జనాభాకు తెలంగాణ సంవత్సరానికి రూ.33,277 లేదా రోజుకు రూ.91 ఖర్చు చేసింది. సగటున, రెండు రాష్ట్రాలు తమ జైళ్లలో రద్దీని నమోదు చేయలేదు మరియు 250% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ రేట్లను నమోదు చేసే జైళ్లు లేవు. 1-3 సంవత్సరాలుగా నిర్బంధించబడిన విచారణలో ఉన్న ఖైదీల వాటా కూడా దేశంలోనే అత్యల్పంగా ఉంది – ఆంధ్రప్రదేశ్‌లో 7%, తెలంగాణలో 8%. తెలంగాణ తన జైళ్లలో 86% వీడియో-కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలను కలిగి ఉందని నివేదించింది, అయితే ఆంధ్రప్రదేశ్‌లో 72% మాత్రమే ఈ సౌకర్యం కలిగి ఉంది.

జైలు సిబ్బందిలో, జైలు అధికారులలో తెలంగాణ అత్యల్ప లోటును (9%) నివేదించగా, ఆంధ్రప్రదేశ్ 21% లోటు ను నివేదించింది. 2017 నుండి కరెక్షనల్ సిబ్బందిలో ఖాళీలు లేవని నివేదించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. అయి తే, 2017 నుండి ఆంధ్రప్రదేశ్ దీని కోసం ఎటువంటి పోస్టులను మంజూరు చేయలేదు. 2022 లో ఆంధ్రప్రదేశ్ కేవ లం 5% వైద్యుల కొరతను నివేదించింది – ఇది దేశంలోనే అత్యల్పం – తెలంగాణలో 59% ఉంది – ఇది రాష్ట్రాలలో అత్యధికం.

న్యాయ సహాయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తమ మొత్తం లీగల్ ఎయిడ్ బడ్జెట్‌కు 80% కంటే ఎక్కువ మొత్తాలను నమోదు చేశాయి. 2022-23లో రెండూ 100% కంటే ఎక్కువ వినియోగాన్ని నమోదు చేశాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ 89% మేరకు NALSA నిధుల వినియోగాన్ని నివేదించగా, తెలంగాణ కేవలం 61% మాత్రమే నివేదించింది.

DLSA కార్యదర్శులలో ఆంధ్రప్రదేశ్ కూడా 8% లోటును నివేదించింది, తెలంగాణ ఏదీ నివేదించలేదు. రెండు రాష్ట్రాలు PLV సంఖ్యలలో తగ్గుదలని నమోదు చేశాయి. లక్ష జనాభాకు 3 PLVలను నివేదించాయి. ఆంధ్రప్రదేశ్‌ లో ఒక లీగల్ సర్వీస్ క్లినిక్ 121 గ్రామాలకు సేవలందించగా, తెలంగాణలో 440 గ్రామాలకు ఒక లీగల్ సర్వీస్ క్లినిక్ ఉంది.

ఐజేఆర్ 2025 తక్షణ, ప్రాథమిక దిద్దుబాటులను పునరుద్ఘాటించింది. ఖాళీలను అత్యవసరంగా భర్తీ చేయడం మరియు ప్రాతినిధ్యం పెంచడం అవసరమని ఇది నొక్కి చెప్పింది. తిరిగి మార్చలేని మార్పును తీసుకురావ డానికి, న్యాయం అందించడం ఒక ముఖ్యమైన సేవగా గుర్తించాలని ఇది సూచించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2025 India Justice Report
  • ap
  • karnataka
  • Legal system
  • telangana

Related News

Poisonous Fevers

Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

Poisonous Fevers : ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో గురుకుల విద్యార్థులను విషజ్వరాలు తీవ్రంగా వణికిస్తున్నాయి. ఇటీవల కురుపాం మండలంలోని ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాలలో

  • Vizagsummit

    Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

  • Bandh Effect

    BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

  • Kavitha Bc Bandh

    BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd