2000 Public Servants Booked : మూడేళ్లలో 2వేల మంది ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ కేసులు
2000 Public Servants Booked : గత 3 సంవత్సరాల వ్యవధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న 2,000 మందికిపైగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై సీబీఐ (CBI) కేసులు నమోదు చేసింది.
- Author : Pasha
Date : 31-07-2023 - 11:37 IST
Published By : Hashtagu Telugu Desk
2000 Public Servants Booked : గత 3 సంవత్సరాల వ్యవధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న 2,000 మందికిపైగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై సీబీఐ (CBI) కేసులు నమోదు చేసింది. 2020లో 608 మంది గవర్నమెంట్ ఉద్యోగులు, పోలీసు అధికారులపై అవినీతి కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2021లో కొంత తగ్గి 582కి చేరింది. 2022లో మొత్తం 844 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ కేసులు నమోదయ్యాయి. అధికారులపై నమోదయ్యే కేసులు సగటున 44 శాతం పెరిగాయని(2000 Public Servants Booked) కేంద్ర హోం శాఖ తాజా గణాంకాలు చెబుతున్నాయి.
Also read : Baby Mega Cult Celebrations : మా పారాసిటమాల్ మీరే..మా మాన్షన్ హౌస్ మీరే ‘చిరు’…
లంచం పుచ్చుకున్న కేసులో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖకు చెందిన ముగ్గురు అధికారులను సీబీఐ శనివారం అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ డేటా వెలుగులోకి వచ్చింది. దేశంలోని 9 రాష్ట్రాల్లో సీబీఐ విచారణపై ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ.. మిగితా చోట్ల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై సీబీఐ కేసులు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. సీబీఐ దర్యాప్తుకు సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.
Also read : SPY Movie: నిఖిల్ పాన్ ఇండియా క్రేజ్.. ఓటీటీలో దూసుకుపోతున్న SPY మూవీ