Baby Mega Cult Celebrations : మా పారాసిటమాల్ మీరే..మా మాన్షన్ హౌస్ మీరే ‘చిరు’…
డిప్రెషన్‍లో ఉంటే చిరంజీవి పాట, జ్వరముంటే చిరంజీవి పాట, హ్యాపీనెస్ ఉంటే చిరంజీవి పాట
- Author : Sudheer
Date : 31-07-2023 - 11:29 IST
Published By : Hashtagu Telugu Desk
మా పారాసిటమాల్ మీరే..మా మాన్షన్ హౌస్ మీరే ‘చిరు’ అంటూ బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ తనలోని అభిమానాన్ని చాటుకున్నారు. ఆనంద్ దేవరకొండ – వైష్ణవి (Anand Deverakonda, Vaishnavi Chaitanya) జంటగా హృదయ కాలేయం ఫేమ్ సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన మూవీ బేబీ. జులై 14 న ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది.
కథలో దమ్ము ఉండాలి కానీ ..స్టార్ కాస్ట్ అవసరం లేదని , పెద్ద నిర్మాణ సంస్థ అవసరం లేదని మరోసారి బేబీ తో రుజువైంది. కేవలం రెండు వారాల్లో ఈ మూవీ దాదాపు రూ.75 కోట్లు కలెక్ట్ చేసిందంటే..సినిమా ఎంతగా ఆకట్టుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ ఇంత పెద్ద సక్సెస్ కావడం తో నిర్మాత SKN వరుస సక్సెస్ మీట్ లు ఏర్పాటు చేస్తూ..సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు.
రీసెంట్ గా అల్లు అర్జున్ సమక్షం లో ఓ ఈవెంట్ జరిపిన SKN …ఆదివారం మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో సక్సెస్ మీట్ (Mega Cult Celebrations) ఏర్పాటు చేసి సినిమా కు మరింత మైలేజ్ ఇచ్చారు. ఈ ఈవెంట్ లో ప్రతి ఒక్కరు చిరంజీవి గారిఫై తమ అభిమానాన్ని చాటుకోగా..డైరెక్టర్ సాయి రాజేష్ స్పీచ్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
“ఒక చిరంజీవి ఫ్యాన్ (Chiranjeevi Fan) కు ఉండే అదృష్టాలు మీకు (చిరంజీవి) ఉండవు అన్నయ్యా. మేం ఏం చేస్తాం.. ఎలా ఉంటాం అనేది మీరు చూడలేరు. డిప్రెషన్‍లో ఉంటే చిరంజీవి పాట, జ్వరముంటే చిరంజీవి (Chiranjeevi ) పాట, హ్యాపీనెస్ ఉంటే చిరంజీవి పాట, బాధలో ఉంటే చిరంజీవి పాట.. మీరే మా పారసిటమాల్, మీరే మా మాన్షన్ హౌస్ హౌస్, మీరే మా సింగిల్ మాల్ట్.. మీరే.. మాకు అన్నీ మీరే” అంటూ సాయి మాట్లాడుతుండగా..చిరంజీవి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు.
అమెరికాలోని డల్లాస్‍లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినా.. రోజంతా కష్టపడే ఆటోవాలా అయినా.. ఎవరైనా అందరూ చిరంజీవి అభిమానులేనని.. చిరంజీవి ఫ్యాన్స్ అంతటా ఉంటారని ఎమోషనల్ అయ్యారు రాజేష్. “అర్జున్ రెడ్డి తీసినోడు చిరంజీవి ఫ్యాన్.. హృదయ కాలేయం తీసినోడు చిరంజీవి ఫ్యాన్. అక్కడ.. ఇక్కడ అనేం లేదు.. అంతటా చిరంజీవి ఫ్యాన్సే” అంటూ సాయి రాజేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ప్రతి మెగా అభిమాని ఈ వీడియో ను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
Read Also : Constable Firing-4 Dead : ట్రాన్స్ ఫర్ చేశారనే కోపంతో రైల్వే కానిస్టేబుల్ ఫైరింగ్.. నలుగురి మృతి