Telangana Politics: తెలంగాణ సంపదపై కన్నేసిన షర్మిల: మంత్రి గంగుల
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణను దోచుకునేందుకే షర్మిల ఇక్కడ పార్టీ పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
- By Praveen Aluthuru Published Date - 04:57 PM, Tue - 30 May 23

Telangana Politics: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణను దోచుకునేందుకే షర్మిల ఇక్కడ పార్టీ పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్న గంగుల షర్మిలను టార్గెట్ చేశారు.
గంగుల మాట్లాడుతూ… తెలంగాణ సంపదపై కన్నేసిన షర్మిల వేరు వేరు పార్టీలతో ప్రజల్లోకి వస్తుందన్నారు. ఆమెను నమ్మి ఓట్లేస్తే తెలంగాణ సంపదను ఆంధ్రాకు పట్టుకెళ్లిపోతుంది అంటూ ఆరోపించారు. తెలంగాణలో షర్మిలకు ఏం పని అని ప్రశ్నించారు మంత్రి గంగుల. తెలంగాణాలో విపరీతమైన సంపద ఉన్నదని, తెలంగాణాలోని సింగరేణి సంపదని రాజమండ్రికి తరలించేందుకు షర్మిల ఎత్తులు వేస్తుందంటూ ఆమెపై మండి పడ్డారు. తెలంగాణ చరిత్ర, ఇక్కడ ఆచారవ్యవహారాలు ఆమెకు ఎం తెలియవని, ఆమెను నమ్మి మోసపోవద్దంటూ హితవు పలికారు గంగుల.
తెలంగాణాలో షర్మిల పాదయాత్ర చూస్తుంటే గత చరిత్ర గుర్తుకు వస్తుందన్నారు. గతంలో పాదయాత్ర చేసిన వారు తెలంగాణను మోసం చేసిన విధానాలు ఇప్పుడు షర్మిల తన పాదయాత్రతో నీరూపిస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు వైఎస్ షర్మిలకు లేదని ధ్వజమెత్తారు. వివిధ పార్టలతో కలిసి తెలంగాణాలో విషభీజాలు నాటేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజలు షర్మిలను నమ్మి మోసపోవద్దని, ఆమె కేవలం తెలంగాణ సంపద కోసమే ఇక్కడికి వచ్చి, పార్టీ పెట్టారని ఆరోపణలు గుప్పించారు మంత్రి గంగుల.
వైఎస్ఆర్టీపి పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల తెలంగాణ సర్కారుపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం కెసిఆర్ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ అధికార పార్టీకి తలనొప్పిగా మారారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ధర్నాలు, నిరసనలకు ఆమె ప్రధాన నాయకత్వం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ ని గద్దె దించడమే ప్రధాన ఎజెండాగా ఆమె ముందుకు వెళ్తున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె త్వరలోనే కాగ్రెస్ తో దోస్తీ కట్టేందుకు సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపధ్యంలో తెలంగాణ బీఆర్ఎస్ నేతలు షర్మిలను టార్గెట్ చేస్తూ ఆమెపై విమర్శల దాడికి దిగుతున్నారు.
Read More: MLC Kavitha: దేశంలో ఎవ్వరూ చేయనన్ని పనులు కేసీఆర్ చేశారు: ఎమ్మెల్సీ కవిత