HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ys Sharmila Criticized Ktr And Kcr Saying Telangana Taliban

Telangana: తెలంగాణ తాలిబన్లను తరిమికొట్టాలి

తెలంగాణలో మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ని గద్దె దించేందుకు విపక్షాలు వ్యయాలు రచిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలంగా తయారైంది

  • Author : Praveen Aluthuru Date : 06-11-2023 - 9:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana (72)
Telangana (72)

Telangana: తెలంగాణలో మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ని గద్దె దించేందుకు విపక్షాలు వ్యయాలు రచిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలంగా తయారైంది. ఇక అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో మూడు పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణలో కొత్త పార్టీతో ఎన్నికల్లో పోటీ చేసందుకు వైఎస్ షర్మిల సిద్ధమైంది. తొలుత ఆమె కాంగ్రెస్ నుంచి పోటీకి దిగుతుంది అనుకున్నా పరిణామాల దృష్ట్యా అది సాధ్యపడలేదు. ఈ మేరకు ఆమె ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో షర్మిల అధికార బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబంపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా షర్మిల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై దుమ్మెత్తిపోసింది.

తాజాగా మాట్లాడిన వైఎస్ షర్మిల.. అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా సెంటిమెంట్ ని వాడుకుంటున్నావా కేటీఆర్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మీ తండ్రీకొడుకులను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరని ఎద్దేవా చేశారు. నమ్మి రెండు దఫాలు అధికారమిస్తే రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా తిన్న వెన్నుపోటుదారులు కేసీఆర్, కేటీఆర్ మరియు కల్వకుంట్ల కుటుంబం అంటూ ధ్వజమెత్తారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి, కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్న బందిపోట్లు మీరేనంటూ మండిపడ్డారు.

రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి దివాలా తీయించిన దొంగలు మీరు.కోటి ఎకరాల మాగానికి సాగునీరని పనికి రాని ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్లు కాజేసిన దోపిడీదారులు మీరు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి 10 ఏళ్లలో లక్ష ఉద్యోగాలు ఇవ్వలేని మీరు నిరుద్యోగుల పాలిట వ్యతిరేక శక్తులు. 3 ఎకరాల భూమి,ఇంటికి 10 లక్షలు అని చెప్పి దళితులను దగా చేసిన దళిత ద్రోహులు మీరు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం ప్రజలంతా ఏకమై సాగించిన ఉద్యమం సాక్షిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. నిధులు మీ ఖజానాకే.. నీళ్లు మీ ఫామ్ హౌజ్ కే.. నియామకాలు మీ ఇంట్లోకే.ఇంకా సెంటిమెంట్ రాజకీయాలు చేసి గద్దెనెక్కాలనుకోవడం మీ అవివేకానికి, అత్యాశకు నిదర్శనం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి,నియంత పాలన చేస్తున్న తాలిబన్లను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారంటూ సంచలన ఆరోపణలు చేశారు షర్మిల.

Also Read: Gold Price Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • ktr
  • taliban
  • telangana
  • ys sharmila

Related News

Travels Bus Overturns In Ni

Accident : నిజామాబాద్ జిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు

జాతీయ రహదారిపై అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేదా సాంకేతిక లోపం వల్ల బస్సు అదుపు తప్పిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

  • Cm Revanth Vs Aravind

    CM Revanth : మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు

  • Telangana, Mla Defection

    సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్

  • Inter Results 2026

    TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

  • Ktr Velugumatla Demolition

    Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

Latest News

  • ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్

  • నాసిరకం భోజనం పై మంత్రి నారా లోకేష్ సీరియస్

  • తెలంగాణలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

  • విడాకుల తర్వాత హన్సిక ఎమోషనల్‌ పోస్ట్!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd