Gold Price Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు
బంగారాన్ని అమితంగా ఇష్టపడే మహిళలు పండుగలు, వివాహ శుభకార్యాలకు తప్పకుండ బంగారం కొనుగోలు చేస్తారు. కాస్త డబ్బు ఎక్కువ ఉన్నవాళ్లు సాధారణ రోజుల్లో బంగారం ధరలను పరిశీలించి, ధరలు ఫర్వాలేదనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొనుగోలు చేస్తుంటారు.
- By Praveen Aluthuru Published Date - 09:17 AM, Mon - 6 November 23

Gold Price Today: బంగారాన్ని అమితంగా ఇష్టపడే మహిళలు పండుగలు, వివాహ శుభకార్యాలకు తప్పకుండ బంగారం కొనుగోలు చేస్తారు. కాస్త డబ్బు ఎక్కువ ఉన్నవాళ్లు సాధారణ రోజుల్లో బంగారం ధరలను పరిశీలించి, ధరలు ఫర్వాలేదనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొనుగోలు చేస్తుంటారు. బంగారం, వెండి, ప్లాటినం కొనేవారు ముందుగా గూగుల్ లేదా యూట్యూబ్ లో ధరలు తెలుసుకుని అప్పుడు కొనేందుకు రెడీ అవుతారు. మరి అలాంటివారి కోసం బంగారం, వెండి ప్లాటినం ధరలను ఇక్కడ పేర్కొనబడ్డాయి.
నవంబర్ 6వ తేదీ సోమవారం రోజున బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రోజు 22 క్యారెట్ల తులం (10 గ్రాముల ) బంగారం 56,500 వద్ద నడుస్తుంటే 24 క్యారెట్ల తులం ( 10 గ్రాములు) బంగారం 61,640 కి అందుబాటులో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇవే ధరలు వర్తిస్తాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 56,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 61,790 వద్ద ట్రేడ్ అవుతుంది.
బంగారం కొనలేనివారు అవసరాన్ని బట్టి వెండి కొంటుంటారు. ముఖ్యం పూజ సామాగ్రిని వెండి రూపంలో కొనుగోలు చేస్తారు. మరి ఈ రోజు వెండి ధరలను చూస్తే..కిలో వెండి 78,000కు లభిస్తుంది. చెన్నైలో కిలో వెండి 78,000. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలలో కిలో వెండి 75,000కు అందుబాటులో ఉంది. అయితే బెంగళూరులో మాత్రం కిలో వెండిపై 1250 పెరిగింది. దీంతో కిలో వెండి 74,000కు చేరింది. ఇక 10 గ్రాముల ప్లాటినంపై 190 పెరిగి 24,910 కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
Also Read: Frostbite: చలికాలంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు